హైదరాబాద్

ఎస్‌బిహెచ్ కుంభకోణం దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: ఎస్‌బిహెచ్‌లో ఖాతాల మళ్లింపు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గత డిసెంబర్ నెలలో నాలుగు బ్యాంకుల్లో సుమారు 43.48 కోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. జనవరిలో నలుగురు బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి మణి దామోదరన్ గత ఏప్రిల్‌లో సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్టు కాగా మరికొందరిని అరెస్టు చేసేందుకు సిబిఐ ఆధారాలు సేకరిస్తుంది. సిబిఐచేపట్టిన ఈ బ్యాంకు కుంభకోణం కేసులో పురోగతి సాధించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించిన నాలుగు కేసుల్లో సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. ఎస్‌బిహెచ్ మల్కాజ్‌గిరి, సింగపూర్ టౌన్‌షిప్, నల్లకుంట బ్రాంచిలతోపాటు ఖమ్మంలోని యునైటెడ్ బ్యాంక్ అఫ్ ఇండియాలో మొత్తం 43.48 కోట్ల డిపాజిట్లు ఇతర ఖాతాల్లోకి మళ్లినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. ఎస్‌బిహెచ్ మల్కాజ్‌గిరి శాఖలో రూ. 8.45 కోట్లు గల్లంతు కాగా ఈ కేసులో కీలక వ్యక్తి మణి దామోదరన్‌తోపాటు ఫ్రాంక్లిన్ అలియాస్ విజయ్‌కుమార్, వికె సాయికుమార్, బ్యాంక్ మేనేజర్ నీరజ శ్రీనివాస్‌లను సిబిఐ అరెస్టు చేసింది. ఖమ్మం బ్యాంక్‌లో రూ. 5.3 కోట్ల కుంభకోణంలో గుజరాత్‌కు చెందిన వ్యాపారి ఘన్‌శ్యామ్ సిజోషి, హార్ధిక్ ప్రవీణ్ భాయి జోషి, బ్యాంక్ మేనేజర్ కె శ్రీకాంత్ అరెస్టయ్యారు. కాగా ఈ కేసుల్లో సిబిఐ మరిన్ని ఆధారాలు సేకరించడంలో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు అరెస్టు కాబడిన ఏడుగురితోపాటు మరో ఆరుగురు బ్యాంక్ ఉన్నతాధికారులున్నట్టు సమాచారం. ఆధారాలు లభించగానే వీరిని కూడా సిబిఐ అరెస్టు చేయనున్నట్టు ఓ సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు. డిపాజిట్ల కుంభకోణంలో ఎస్‌బిహెచ్ మాజీ ఉద్యోగి కెవి రమణరావు మధ్యవర్తిత్వం నెరపి మల్కాజ్‌గిరి, నల్లకుంట, సింగపూర్ టౌన్‌షిప్ మేనేజర్లను తప్పుదోవ పట్టించి ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఒరిజినల్ రశీదులను తీసుకొని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఫిక్స్డ్ డిపాజిట్లను ఇతర ఖాతాల్లోకి మళ్లించి అక్రమాలకు పాల్పడినట్టు సిబిఐ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీ, ఎపి మాడ్యులర్ ఎంప్లాయేబుల్ స్కిల్స్ సొసైటీ, న్యూఅండ్ రెనివేబుల్ ఎనర్జి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఎపి లిమిటెడ్‌కు చెందిన నిధులు కూడా ఇతర ఖాతాల్లోకి మళ్లినట్టు సిబిఐ గుర్తించింది. ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బందే కీలకమని, మల్కాజ్‌గిరి బ్రాంచితోనే బయటపడుతుందని త్వరలో మరికొందరిని అరెస్టు చేయనున్నట్టు ఓ సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు.

చక్కటి జీవనశైలితో డయాబెటిస్‌కు చెక్

హైదరాబాద్, జూన్ 4: చక్కటి జీవనశైలితో డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చునని గాంధీ మెడికల్ కాలేజీ రిటైర్డు ప్రొఫెసర్ సుధారావు అన్నారు. దేశవ్యాప్తంగా ఎండోక్రినాలీజీ స్పెషలిస్టులతో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ ఎండోక్రినాలజి అండ్ అడిపోసిటి(ఐడియా) ఆధ్వర్యంలో నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో రెండురోజుల నుంచి జరుగుతున్న సెమినార్‌కు ఆయన శనివారం ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీ రిటైర్డు,ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్యే సుధారావు, లండన్‌కు చెందిన కింగ్స్ కాలెజ్ ఎండి డా.వేణు, ‘ఐడియా’ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. శ్యామ్, ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు హజరయ్యారు. దేశంలో రోజురోజుకి మధుమేహా వ్యాధి గ్రస్తులు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా రోగాలతో పోల్చితే మధుమేహా వ్యాధిగ్రస్తులే మన దేశంలో అధికంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డయాబెటిస్ ముదిరిన కొద్దీ శరీరంలోని ఒక్కొక్క భాగం పాడవుతూ ఉంటుందని వారు వివరించారు. ఈ వ్యాధిలో అత్యంత ప్రమాకరంగా పాదాల సమస్య ఉంటుందని వెల్లడించారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో పాదాల సమస్య క్రమక్రమంగా ఇబ్బందిగా మారుతోందని, చివరికి కాలు కొట్టేయాల్సిన దుస్థితి దాపురిస్తోందని హెచ్చరించారు.