హైదరాబాద్

ముందుచూపు లేకుంటే మునకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: మహానగరంలో ఈ సారి సాధారణ వర్షపాతం కన్నా కాస్త ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశముందంటూ కేంద్ర వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో వివిధ ప్రభుత్వ శాఖల్లో కదలిక వచ్చింది. నిన్నమొన్నటి వరకు ఎండలు బాగా మండిపోవటం, వాతావరణంలో మార్పుల నేపథ్యంలో క్యుములోనిబంస్ మేఘాల ప్రభావంతో బలమైన ఈదురుగాలులతో పలు సార్లు వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే! ఆగకుండా అరగంట సేపు గట్టిగా వర్షం కొడితే అరిటాకులా వణికిపోయే నగరం మున్ముందు కురిసే వర్షాలకు ఎదురీడి నిలవాలంటే వివిధ ప్రభుత్వ శాఖలకు కాస్త ముందు చూపు అవసరమేనన్న వాదనలున్నాయి. లేని పక్షంలో 2000లో నగరాన్ని ముంచెత్తిన వరదలు మళ్లీ పునరావృత్తమయ్యే అవకాశాలున్నాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అనేక సరిగ్గా పదిహేనేళ్ల క్రితం నగరాన్ని వరదలు ముంచెత్తినపుడు భవిష్యత్తులో నగరాన్ని వరదల ముప్పును నంచి రక్షించేందుకు అప్పటి ప్రభుత్వ కిర్లోస్కర్ కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించిన సంగతి తెలిసిందే! కానీ కిర్కోస్కర్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒక్కదాన్ని కూడా జిహెచ్‌ఎంసి గానీ, ఇతర ప్రభుత్వ శాఖలు గానీ అమలు చేయకపోవటంతో ఏ మాత్రం గట్టిగా వర్షం పడినా, నగరం పరిస్థితి అయోమయం, గందగోళమేనని చెప్పవచ్చు. హైటెక్‌సిటీగా పేరుగాంచిన నగరంలో కానీ నిజాం హయంలో అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మించిన పాతకాలపుడ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి కాలువల కారణంగా కేవలం గంట సేపు వర్షం దంచికొడితే వర్షపు నీటి ఇన్‌పుట్‌కు తగిన విధంగా ఔట్ పుట్ లేకపోవటంతో నాలాలు, కాలువలు పొంగి ప్రవహించటంతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఫలితంగా ఇక్కడి ప్రజలు చిరుజల్లులు పడినా, ఎపుడేమవుతుందోనంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
పదేళ్ల ప్రతిపాదనలు
నగరంలో ఏడు సెంటీమీటర్లకు మించి గంటలోపు వర్షం కురిస్తే పరిస్థితి అతలాకుతలమయ్యే పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇప్పటికే పలు సార్ల పర్యావరణ వేత్తలు, నిపుణులు హెచ్చరించినా పాలకులు గానీ, వివిధ శాఖలకు చెందిన అధికారులు గానీ ఏ మాత్రం పట్టించుకోలేదు. 2007లో కూడా ఓ మోస్తారు వర్షాలు కురిసి నదీంకాలనీ, నాగమయ్యకుంట, మల్లేపల్లి ఇతరత్ర ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగాయి. అంతేగాక, హుస్సేన్‌సాగర్ పూర్తి స్థాయిలో నిండి, ప్రమాదకరంగా మారటంతో ఆ చెరువు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ఆ సమయంలో హుస్సేన్‌సాగర్‌కు రెండు గేట్లను ఏర్పాటు చేసి, ప్రమాద హెచ్చరిక వ్యవస్థను సమకూరుస్తామని, ఇందుకు నీటిపారుదల శాఖతో కలిసి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు అప్పటి కమిషనర్ డా.సివిఎస్‌కే శర్మ ప్రకటించి పదేళ్లు గడుస్తున్నా, కనీసం ఇప్పటి ఉన్నతాధికారులకు ఆ విషయం కూడా గుర్తుండకపోవచ్చు.
పరిష్కారం కాని వాటర్ స్టాగినేషన్
చిరుజల్లులు పడితే చాలు నగరంలో నిత్యం రద్ధీగా ఉండే పలు రహదార్లలో మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిలుస్తోంది. పదేళ్ల క్రితం లక్డీకాపూల్‌లోని హోటల్ వుడ్ బ్రిడ్జి ముందు, అలాగే సాంకేతిక భవన్ ముందు, లక్డీకాపూల్ లక్కీ హోటల్ చౌరస్తా, విల్లామేరీ కాలేజీ చౌరస్తా, రాణిగంజ్, ప్రకాశ్‌నగర్ చౌరస్తాల్లో భారీగా వర్షపు నీరు నిలుస్తున్నట్లు గురించి, అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది రూపాయలు వెచ్చించిన పలు సార్లు పనులు చేపట్టినా, అధికారులు ఆశించిన ఫలితం దక్కలేదు. పైన పేర్కొన్న ప్రాంతాల్లో నేటికీ వర్షం కురిసినపుడల్లా వాటర్ స్టాగినేట్ కావటం కన్పిస్తోంది. కనీసం రోడ్డుపై నీరు నిలవటాన్ని కూడా నివారించలేని పనినైపుణ్యత గ్రేటర్ ఇంజనీర్లలో లేకపోవటం గమనార్హం. అంతేగాక, అమీర్‌పేట మైత్రి భవన్ వద్ధ, బైబిల్ హౌజ్ రైల్వే బ్రిడ్జి కింద కూడా చిన్నపాటి వర్షానికే భారీగా వర్షపు నీరు నిలుస్తుండటంతో, ఈ నీటిని ఎప్పటికపుడు తోడేసేందుకు శాశ్వతంగా ఎక్కువ సామర్ద్యం కల్గిన మోటారు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పూర్వ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రకటించినా, శుక్రవారం కురిసిన వర్షానికి ఇక్కడ అదే సీను రిపీట్ అయి, ఇక్కడి రహదారి చిన్నసైజు చెరువును తలపించింది.
తూతూమంత్రంగా నాలాల పూడికతీత
ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే నగరంలోని అన్ని నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సును ఏ ఒక్క సంవత్సరం కూడా జిహెచ్‌ఎంసి అధికారులు సమ్రకంగా అమలు చేయలేదు. ఏటా పూడికతీత పనుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించామంటూ బిల్లులు డ్రా అవుతున్నాయే తప్పా, నాలాల్లోని పూడిక మొత్తం తీయటం లేదు. ఫలించి చిన్నపాటి వర్షానికే నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా మే నెలాఖరుకల్లా పూడికతీత పనులు పూర్తి చేయాల్సి ఉన్నా, ఇంకా పనులు తూతూమంత్రంగా కొనసాగుతుండటం అధికారుల చిత్తశుద్ధి, ముందస్తు చూపుకు నిదర్శనం.