హైదరాబాద్

ఉద్యమ విద్యార్థులకు ఉద్యోగాలు ఉద్యమ కేసులు ఎత్తి వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘాల నాయకులకు, ఇతర విద్యార్థులకు ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకున్నట్లు ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూరాల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. నాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులన్నింటినీ ఎత్తి వేయాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో కెసిఆర్‌ను కోరారు. విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఖాళీ ఉద్యోగాల భర్తీ సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ సిఎంను కోరారు.