హైదరాబాద్

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ట్రా‘ఫికర్’4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూన్ 5: మెట్రో కారిడార్ మార్గాలలో ప్యాచ్‌వర్క్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. స్థల సేకరణ జరిగి కూల్చివేతలు పూర్తయినా రోడ్డు పూర్తిస్థాయిలో వాహనదారులకు, పాదచారులకు అందుబాటులోకి రాలేదు. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ట్రాఫికర్ సమస్య తొలగటంలైదు. ఇక్కడ మెట్రో పిల్లర్ల నిర్మాణం పూర్తయినా ట్రాఫిక్ సమస్య ఏమాత్రం తగ్గటం లేదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్ పరిసరప్రాంతాలు, నారాయణగూడ రోడ్డు, చిక్కడపల్లి పోలీస్‌స్టషన్, గోల్కొండ క్రాస్‌రోడ్ తదిదర ప్రాంతలలోని రోడ్డు అధ్వాన్నంగా తయారయ్యింది.
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది, రోడ్డు ఏమ్రాత్రం నడవటానికి వీల్లేని విధంగా మారింది. ఫిల్లర్లు నిర్మాణం పూర్తయినా రోడ్డుకిరువైపులా ప్యాచ్‌వర్క్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కేబుల్ వైర్లు, ఇతర పైప్‌లైన్ వర్కులు అస్తవ్యస్థంగా కొనసాగుతున్నాయి. రోడ్లపై తవ్విన గుంతలను మాత్రం సరిగ్గా పూడ్చటం లేదు. రోడ్డు సైజు కుచించుకుపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు టర్నింగ్‌లో వేగంగా వచ్చిన వాహనదారులు గుంతలను చూసుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.