రాశిఫలం 7-06-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ తదియ రా.3.40
నక్షత్రం: 
ఆర్ద్ర ఉ.11.22
వర్జ్యం: 
రా.11.09 నుండి 12.43 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.08.24 నుండి 09.12, తిరిగి రా.10.48నుండి 11.36
రాహు కాలం: 
మ.3.00 నుండి 4.30
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంటుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా నుండుట అవసరం.
వృషభం: 
(కృత్తిక 2,3,4పా., రోహిణి, మృగశిర 1,2పా.) అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగానుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
మిథునం: 
(మృగశిర 3,4పా., ఆర్ద్ర, పునర్వసు 1,2,3పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగానుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
కర్కాటకం: 
(పునర్వసు 4పా., పుష్యమి, ఆశ్రేష) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగానుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ఈరోజు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
కన్య: 
(ఉత్తర 2,3,4పా., హస్త, చిత్త 1,2పా.) ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణ బాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
తుల: 
(చిత్త 3,4పా., స్వాతి, విశాఖ 1,2,3పా.) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథాప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగావుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
వృశ్చికం: 
(విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగాచేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధనుండి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి వుంటారు. ఆచితూచి అడుగులేయడం అవసరం.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించుట అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనవసర ధనవ్యయంతో ఋణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
మకరం: 
(ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) కొన్ని ముఖ్యమైన పనులు వాయిదావేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్తవహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
కుంభం: 
(్ధనిష్ఠ 3,4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగానుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టమేర్పడకుండా జాగ్రత్తవహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
Date: 
Tuesday, June 7, 2016
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి