హైదరాబాద్

చల్లబడిన నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కొద్దిరోజుల క్రితం వరకు పగటి పూట ఎండ వేడిమి, సాయంత్రం కాగానే బలమైన గాలులతో కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే! ఈ సారి వేసవి కాలంలో నగరంలో పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా దాదాపు 45 డిగ్రీలు దాటిన సంగతి తెలిసిందే! ఇంకా వర్షాకాలం ప్రారంభం కాకపోయినా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ, నైరుతి రుతుపవనాల రాక సందర్భంగా వాతావరణం హైదరాబాద్‌లో వాతావరణం కూల్ కూల్‌గా మారింది. అంతేగాక, పగటి ఉష్ణోగ్రత కూడా ఒక్కసారిగా 28 డిగ్రీలకు పడిపోయింది. ఈ నెల 8వ తేదీ వరకు నైరుతి రుతుపవానాలు ప్రవేశించిన అవకాశముండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త, ద్రోణీగా మారే అవకాశాముండటంతో రానున్న రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచించింది.