హైదరాబాద్

శాంతియుత వాతావరణంలో రంజాన్‌ను జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, జూన్ 6: రంజాన్ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను వివిధ ప్రభుత్వ శాఖలు పర్యవేక్షించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అదేశించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం సాలార్‌జంగ్ మ్యూజియంలో జరిగిన వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులకు సంబంధించిన ఇమామ్‌లు, మసీదు కమిటీ అధ్యక్షులు ఎల్లపుడు స్థానిక పోలీసులకు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. మసీదుల వద్ద నీటి సమస్య, డ్రేనేజీ సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలు మసీదులకు చెందిన నిర్వహకులు ఫిర్యాదు చేశారు. ప్రార్థనల సందర్భంగా మసీదు కమిటీ వారు ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని అవసరమైతే స్థానిక పోలీసు సహకారం తీసుకోవాలన్నారు. వివిధ శాఖల తరఫున మసీదుల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారులు యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేంద్ర మాట్లాడుతూ ప్రధాన మసీదుల వద్ద ప్రత్యేక ట్రాఫిక్‌కు సంబంధించి ఏలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, మసీదు కమిటీవారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ట్రాఫిక్ వలంటీర్లను ఏర్పాటు చేయాలని, అందుకు అన్ని విధాల సహయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జిహెచ్‌ఎంసి దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా పారిశుధ్ద్యం, ఏలక్ట్రికల్‌తో పాటు వివిధ మసీదుల వద్ద చేపట్టాల్సిన అభివృద్ది పనులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ, మసీదు నిర్వహకులకు అధికారులు అందుబాటులో ఉండే విధంగా రౌండ్ ది క్లాక్ విధులు నిర్వహించే అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఏలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. టిఎస్‌సిపిడిసిఎల్ హైదరాబాద్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. ఆనంద్ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను అదనంగా ట్రాన్స్‌ఫార్మార్లను ఏర్పాటు చేస్తామన్నారు. తమ సిబ్బంది రౌండ్ ది క్లాక్ విదులు నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగర పోలీసు అదనపు కమిషనర్ శ్రీనివాస్‌రావు, జితేందర్, జాయింట్ సిపి ఎస్‌బి ప్రమోద్‌కుమార్, దక్షిణ మండలం డిసిపి సత్యనారాయణ పాల్గొన్నారు.