రంగారెడ్డి

విజభన సమయంలో రెండేళ్లు క్లిష్టమని తెలియదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 6: విభజన సమయంలో రెండేళ్ల సమయం చాలా క్లిష్టమని తెలియదా అని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్ సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఎఎస్ విభజనకు ఏడు నెలల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని, ఆ విషయంలో ఏనాడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిచేందుకు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారనా అని అన్నారు. 24 గంటల కరెంటు, పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. రెండేళ్ల అభివృద్ధిలో కనిపించకపోవడం విచిత్రకరమని అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల మొదటి రెండేళ్ల పాలన తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. ఒకప్పుడు సిఎం కేసిఆర్.. జెఎసి చైర్మన్‌గా ప్రతిపాదించిన కోదండరాం ఇపుడు వెన్నుపోటు పొడవడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సామాన్యుడికి అర్థమవుతున్న కేసిఆర్ ఆలోచనలను ప్రొఫెసర్ కోదండరాంకు అర్థం కాకపోవడవం విచిత్రకరమని ఎద్దేవా చేశారు. ఎంపిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినా పాలించే సత్తా లేకపోవడంతో పోటీలో నిలబడలేని అసమర్థుడు కోదండరాం అని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి మెప్పు కోసం కోదండరాం.. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారో చెప్పాలని అన్నారు. గుగూల్, ఆపిల్ వంటి అంతర్జాతీయ కంపెనీలను తెచ్చి తెలంగాణ ఆదాయం పెంచుకుంటున్నది వాస్తవం కాదా, వ్యవసాయ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. జెఎసి చైర్మన్ హోదాలో ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దక్కించుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ పాల్గొన్నారు.