రంగారెడ్డి

అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 6: దేశంలోనే కనివిని ఎరుగని రీతిలో డబుల్ బెడ్‌రూం పథకం ప్రవేశపెట్టి పేదలకు విజయవంతంగా ఇళ్లను అందజేస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం అరాంఘర్‌లోని ఇంద్రారెడ్డినగర్, ఏక్తాకాలనీలలో నివసిస్తున్న 150 నిరుపేద కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత శతాబ్ద కాలంగా ఇంద్రారెడ్డినగర్, ఏక్తాకాలనీలలో నివసిస్తున్న 150 కుటుంబాలకు స్థానికంగానే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రజలు డబుల్ బెడ్‌రూం స్కీమ్ కింద ఇండివిడ్యువల్‌గా కట్టించాలని తన దృష్టికి తీసుకువచ్చారని, అక్కడ ప్రజలను ఒప్పించి డబుల్ బెడ్‌రూం స్కీమ్ కింద అపార్టుమెంట్‌లో నిర్మించి ఇస్తామని ప్రజలను ఒప్పించామని తెలిపారు. అధునాతనమైన వసతులతో డబుల్ బెడ్‌రూం స్కీమ్‌ను పేదలకు కట్టించడం జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తామని, కొన్ని హామీలను ఇప్పటికే పూర్తి చేశామని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. అందరు సహాయ సహకారాలు అందించినప్పుడే ఏదైనా చేయడానికి సులభం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కోరణి శ్రీలత, డిప్యూటీ కమిషనర్ దశరథ్, హౌసింగ్ సొసైటీ అధికారులు నాయకులు సరికొండ వెంకటేష్, ఎన్ను శ్రీనివాస్‌రెడ్డి, కె.యాదగిరి, ప్రాజెక్టు అధికారి పత్యానాయక్ పాల్గొన్నారు.

హత్య కేసును తప్పుదోవ పట్టించిన ఎస్సైను సస్పెండ్ చేయాలి
హయత్‌నగర్, జూన్ 6: హత్య కేసును తప్పుదోవ పట్టించిన ఎస్సైను సస్పెండ్ చేసి నిందితులను అరెస్టు చేయాలని మృతుడి బందువులు హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి(26) మే 26న మృతిచెందిన విషయం తెలిసిందే. రాజశేఖర్‌రెడ్డి అతను పనిచేస్తున్న షెడ్‌లోని వారి చేతుల్లోనే హత్యకు గురయ్యాడని, నిందితులను తప్పించేందుకు ఎస్సై మన్మదకుమార్.. కేసును తప్పుదోవ పట్టించాడని ఆరోపించాడని విమర్శించారు. నిందితులను అరెస్టు చేసి ఎస్సై మన్మదకుమార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ నరేందర్ మాట్లాడుతూ షెడ్‌లో ఉన్న అందరిని ఒక్కొక్కరిగా విచారించి అసలైన నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. ఎస్సై మన్మదకుమార్‌ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.