రంగారెడ్డి

చేప ప్రసాదానికి ప్రత్యేక ఆర్టీసి బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జూన్ 6: హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదానికి జూన్ 8, 9 తేదీలలో నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.పురుషోత్తమ నాయక్ చెప్పారు. సికింద్రబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్‌తోపాటు, మహత్మగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు 46 ప్రత్యేక బస్సులను జూన్ 8న ఏర్పాటు చేశామని వివరించారు. నగర శివారులో నుంచి 32 బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సికింద్రబాద్ నుండి 8ఎ,8జె, కాచిగుడా స్టేషన్ నుండి 141 , 65తోపాటు ఇసిఐఎల్ నుండి 16/8, బస్సులను ఏర్పాటు చేశారు. వీటితోపాటు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఎబ్జిగ్రౌండ్సు వరకు 251 రూట్ బస్సులను ఏర్పాటు చేశామని వివరించారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఆరు ట్రిప్పులు, ఎన్‌జిఒకాలనీ నుంచి ఆరు బస్సులు, ల్యాబ్స్‌క్వాటర్స్ నుంచి ఆరు ట్రిప్పులు, వివిధ ప్రాంతాల నుండి చార్మినార్‌కు వచ్చిన వారిని తరలించటానికి 65 నెంబర్ రూట్ బస్సులు ఆరు, గోల్కొండ నుంచి ఆరు, రాజేంద్రనగర్ నుంచి ఆరు, రాంనగర్ ప్రాంతం నుంచి 86 రూట్‌లో ఆరు, తార్నాక రూట్‌లో ఆరు, పటాన్‌చెరువు నుంచి 225 రూట్‌లో నాలుగు, జీడిమెట్ల నుంచి నాలుగు, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు నుంచి 187ఎన్ రూట్‌లో నాలుగు బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు.

జోన్లవారీగా క్లూస్ బృందాలను ప్రారంభించిన కమిషనర్

గచ్చిబౌలి, జూన్ 6: సైబరాబాద్ పరిధిలో జోన్లవారీగా క్లూస్ బృందాలను ఏర్పాటు చేశామని కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఐదు జోన్లకు బృందాలను ఏర్పాటు చేసి, ఆయా జోన్లలో డిసిపి ఆధ్వర్యంలో బృందాలు పనిచేసేలా సిబ్బందిని నియమించారు. క్లూస్ టీమ్ వాహనాలను సోమవారం కమిషనర్ సివి ఆనంద్ ప్రారంభించారు. ఆధునాతన సాంకేత పరిజ్ఞానంతో ఆధారాలు సేకరించి పరికరాలను బృందాలను అందించారు. ఆనంద్ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే సంఘటన ప్రదేశానికి క్లూస్ బృందాలు చేరేలా ఆయా జోన్ డిసిపి కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. గతంలో సిబ్బంది అందరూ ఒకే చోట ఉండటంతో సంఘటన స్థలానికి వెళ్లడానికి సమయం పట్టేదని పేర్కొన్నారు. ఇప్పుడు సకాలంలో క్లూస్ బృందాలు చేరేలా ఏర్పాట్లు చేశారు.