హైదరాబాద్

ఏపిఎన్‌జివోస్ గచ్చిబౌలి హౌసింగ్ సోసైటీ విభజన చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: ఏపిఎన్‌జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సోసైటీ విభజన వెంటనే చేపట్టాలని భాగ్యనగర్ టిఎన్‌జివోస్ అసోసియోషన్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి పి.బాలరామ్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణగూడలోని అసోసియోషన్ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపిఎన్‌జివోస్ గచ్చిబౌలి హౌసింగ్ సోసైటీని విభజించాలని కోరుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన 1800 మంది ఉద్యోగులు సోసైటీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. డిసిఒ ఏపిఎన్‌జివోస్ గచ్చిబౌలి హౌసింగ్ సోసైటీ అధ్యక్షునిగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రత్యేక జనరల్‌బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నోటిసులు ఇచ్చినప్పటికి హౌసింగ్ సోసైటి అధ్యక్షుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లీగల్ ఓపినియన్‌ను హైకోర్టు కోఆపరేటివ్ జిపి ద్వారా డిసిఓ కోరామని తెలిపారు. హైకోర్టు లీగల్ ఓపినియన్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున సెక్షన్ 24(3) కోఆపరేటివ్ మాక్స్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక జనరల్ బాడీమీటింగ్ పెట్టాల్సిందిగా డిసిఓకు లీగల్ ఓపినియన్ ఇచ్చారని పేర్కోన్నారు. వెంటనే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యగులందరూ వెంటనే భాగ్యనగర్ ఎన్‌జివోస్ అసోసియోషన్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియోషన్ ప్రతినిధులు ఎస్.ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, కేసియానాయక్, శ్రీ్ధర్, హుస్సేన్, డేవిడ్‌రాజు, రమాదేవి, ఎం.శ్రీనివాస్‌రావు, రవికుమార్, రాజేశ్వరరావు, రాజేష్ పాల్గొన్నారు.

యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి

హైదరాబాద్, జూన్ 6: జిహెచ్‌ఎంసిలో కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిఎంఎస్ అనుబంధ భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. అంతేగాక, ఇదివరకే పదోన్నతులిచ్చిన ఉద్యోగులకు వెంటనే పోస్టింగులివ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం యూనియన్ నేతలు ట్యాంక్‌బండ్‌లోని జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. యూనియన్ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు నేతలను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ అధ్యక్షుడు కె. శంకర్, యూనియన్ సంఘటన కార్యదర్శి ఎ. శంకర్ మాట్లాడుతూ గతంలో గుర్తింపు యూనియన్ కాలవ్యవధి 2014 సెప్టెంబర్ 14తో ముగిసి, రెండు సంవత్సరాలయినప్పటికీ ఇప్పటి వరకు యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని యూనియన్ అధ్యక్షుడు కె. శంకర్ ఆరోపించారు. ఎక్కడైనా యూనియన్ ఎన్నికలు రెండు సంవత్సరాలకోసారి నిర్వహించాల్సి ఉంటుందని, కానీ జిహెచ్‌ఎంసిలో నాలుగు సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడటంలో కారణమేమిటీ? అని ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నత న్యాయస్థానం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కార్మిక శాఖకు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కానీ అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయటంలోనూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలు జారీ చేసి ఏడాది గడుస్తున్నా, జిహెచ్‌ఎంసి అధికారులు కార్మిక శాఖ కమిషనర్‌కు పంపించాల్సిన ఉద్యోగుల మస్టర్ రోల్‌ను పంపించకుండా జిహెచ్‌ఎంసి అధికారులు జాప్య చేస్తున్నారని ఆరోపంచారు. ఇప్పటికైనా కమిషనర్ జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకుని కార్మిక శాఖ కమిషనర్‌కు పంపాల్సిన ఎన్నికల ఫైల్ మీద సంతకం చేసి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లేని పక్షంలో కోర్టు ఆదేశాల ధిక్కారం కింద మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన వివరించారు. కార్యక్రమంలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. మల్లేశం మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘం లేనందున కార్మికుల సమస్యలు ఎక్కడిక్కడే పరిష్కారానికి నోచుకుండా ఉండిపోయాయని వివరించారు. అంతేగాక, ఉద్యోగులు, కార్మికులకు రావల్సిన ప్రమోషన్లు, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాల సంబంధిత అనేక సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కమిషనర్ ఇప్పటికైనా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు వినయ్‌కపూర్, శ్రీనివాస్, దిలిప్‌కుమార్, మోహన్‌దాస్, నర్సింగరావు, రాజు, యాదయ్య, మైసయ్య, యాదగిరి, బాలరాజ్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు.