శ్రీకాకుళం

రంజాన్ నెల ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), జూన్ 6: ముస్లీంల పవిత్ర మాసం రంజాన్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు చేయడం ఆనవాయితీ నేపథ్యంలో సోమవారం చంద్రుని దర్శనం కావడంతో రంజాన్ నెల క్యాంలెండర్ విడుదలైంది.స్థానిక జి.టి రోడ్‌లోని జామి యా మసీద్‌లో తరాజినమాజ్ పఠనం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు మహీబుల్లాఖాన్ తెలిపారు. రంజాన్ నెల ప్రారంభానికి సూచనగా సోమవారం మసీద్‌లో సైరన్ మోగించినట్లు చెప్పారు. మంగళవారం వేకువజామున 3:51గంటలకు సహారి, సాయంత్రం 6:31గంటలకు ఇఫ్తార్ సమయాలుగా ఉంటాయన్నారు. కళింగపట్నం ప్రాం తం ముస్లీంలు శ్రీకాకుళం సమయాలకు ఒక నిముషం తగ్గించుకోవాలని, రాజాం ప్రాంత ముస్లీంలు ఒక నిము షం పెంచుకోవాలని వివరించారు. వచ్చేనెల 5వ తేదీతో రంజాన్ నెల ముగుస్తుందని తెలిపారు. ప్రతీరోజు జామి యా మసీదులో జరిగే సామూహిక ప్రార్థనలకు ముస్లీంలంతా హాజరు కావాలని ఆయన కోరారు.

‚

ఆర్టీసీలో సరుకు రవాణా
* డిసిటిఎం శ్రీనివాసరావు
శ్రీకాకుళం(టౌన్), జూన్ 6: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సోమవారం నుండి సరుకు రవాణాకు శ్రీకారం చుట్టినట్లు ఎపియస్ ఆర్టీసీ శ్రీకాకుళం డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీకి చెందిన బస్సులు అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర బస్సుల్లో సరుకు రవాణాకు యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ఎపియస్ ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీస్ పేరుతో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టామని, ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని ప్రతీ డిపోలో ఇందుకు ప్రత్యేక కౌంటర్లు కేటాయించామని చెప్పారు. శ్రీకాకుళం నుండి హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలితో పాటు పాతపట్నం రూట్లలో ఈ సర్వీసు ముందుగా ప్రారంభించామన్నారు. అలాగే పాలకొండ నుండి విజయవాడ, విశాఖపట్నం, పలాస నుండి విజయవాడ, విశాఖపట్నం, ఇచ్ఛాపురం, టెక్క లి నుండి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలకు పార్శిల్ సర్వీసు ఉం దన్నారు. ప్రస్తుతం ఈ విధానంలో సం స్థ లాభనష్టాలను బేరీజు వేసిన అనంతరం మిగిలిన రూట్లకు పొడిగిస్తామని చెప్పారు. ఆయనతో అసిస్టెంటు ట్రాఫిక్ మేనేజరు ఎ.రమేష్ ఉన్నారు.

క్షీర విప్లవం సాధించాలి
* ఎమ్మెల్యే కళా
లావేరు, జూన్ 6: వ్యవసాయ అనుబంధరంగమైన పాడిపరిశ్రమను అభివృద్ధి పరిచి క్షీర విప్లవంసాధించాలని ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్రఅధ్యక్షుడు కళా వెంకటరావు పిలుపునిచ్చారు. మండలంలో బెజ్జిపురం పంచాయతీ రాయనింగారిపేట, బొంతుపేట గ్రామాల్లో విశాఖడెయిరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారులసహకార సంఘ నూతన భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాల దిగబడి శాతం ఘననీయంగా పెరుగుతుందని పాడి రైతులకు విశాఖడెయిరీ మంచి ప్రోత్సాహకాలు అందిస్తుందని కితాబులిచ్చారు. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా డెయిరీ చైర్మన్ తులసీరావు అనేక సంక్షేమ పథకాలను నాంది పలుకుతున్నారని ప్రసంశించారు. రైతులు ఈకేంద్రాలకు పాలు సరఫరా చేయడం ద్వారా డెయిరీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ ఆరంగి రమణబాబు మాట్లాడుతూ పాల ఉత్పత్తి పెంపుదలలో జిల్లా ప్రథమస్థానం సాధించే దిశగా కృషి కొనసాగుతుందని దీనికి రైతులు సహకరించాలని కోరారు. అవసరమైనచోట్ల పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బుడుమూరులో పాల ఉత్పత్తి దారుల కోసం కల్యాణ మండపం నిర్మాణాన్ని కూడా డెయిరీ చేపట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలశీతలకేంద్రం మేనేజర్ స్వామినాయుడు, మండల ప్రత్యేక సలహాదారులు ఎం.సురేష్, జెడ్పిటీసీ ప్రతినిధి మధుబాబు, తెలుగుదేశం పార్టీనాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.