చిత్తూరు

మెరుగైన సౌకర్యాలు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 6: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న కల్యాణ మండపాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి ఉన్నతాధికారులు తనిఖీ చేసి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు ఆదేశించారు. స్థానిక టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం ఆయన సీనియర్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఇఒ మాట్లాడుతూ కల్యాణ మండపాల నిర్వహణ సరిగాలేనందువల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సంబంధిత ఇంజినీర్లు జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వివిధ కల్యాణ మండపాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతనం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ నాలుగు మాడా వీధుల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణం, ఇతర సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తిచేసిన పనులకు త్వరగా బిల్లులను చెల్లించాలని చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. టిటిడిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందవలసిన పెన్షన్, ఇతర ప్రయోజనాలలో ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించి, త్వరితగతిన చెల్లించాలని సంబంధిత అధికారులను ఇఒ ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తూ భక్తులకు అవసరమైన సమాచారం వేగవంతంగా అందించాలని అన్నారు. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు సౌలభ్యం కోసం వినిపించే భక్తి గీతాలకు మరిన్ని అన్నమాచార్య, ఇతర భక్తిగీతాలను జతపరచి భక్తులకు ఆనందం కలిగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యతను తెలిపేలా ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రచురణల విభాగం అధికారులకు సూచించారు. రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుపతి, తిరుమల్లోని అన్ని వసతి సముదాయాల్లో గీజర్లు, వేడి నీటి సౌకర్యం కల్పించాలని, కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇఒ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు తిరుమల్లో నాద నీరాజనం కార్యక్రమంలో మరింత నాణ్యత తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఎస్వీబిసి సిఇఓను కోరారు. ఈ సమావేశంలో జెఇఓ పోల భాస్కర్, న్యాయాధికారి వెంకటరమణ, ఎఫ్‌ఏ అండ్ సిఇఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.