నిజామాబాద్

2017 డిసెంబర్‌కు ఇంటింటికి తాగునీరు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గ్రామాలకు 2017 సంవత్సరం డిసెంబర్ వరకు ఇంటింటికి తాగునీరు అందిస్తామని మిషన్ భగీరథ ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్మూర్ మిషన్ భగీరథ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ పథకాన్ని సకాలంలో పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతోందని అన్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు 4600 కోట్లు, నిజామాబాద్ జిల్లాకు 2700 కోట్లు కేటాయించిందని చెప్పారు. 2016 డిసెంబర్ వరకు ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని 269 గ్రామాలకు మొదటి విడతలో తాగునీరు అందిస్తామని అన్నారు. రెండవ విడతలో 2017 జూన్‌లోగా రెండు జిల్లాల్లోని 444 గ్రామాలకు, మూడవ విడతలో 2017 డిసెంబర్ నాటికి 900 గ్రామాలకు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తామని ఆయన వివరించారు. దీనికోసం జిల్లాలో 32 ప్రోక్లేయినర్లతో పైప్‌లైన్ పనుల కోసం తవ్వకంతో పాటు జాయింటింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయని అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలోని జలాల్‌పూర్ వద్ద 50 కోట్లతో ఇంటెక్‌వెల్ నిర్మాణ పనులు జూలై 15వ తేదిలోపు పూర్తవుతాయని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 ఇంటెక్‌వెల్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎస్సారెస్పీ ఇంటెక్‌వెల్‌ను మూడు రోజుల్లోగా ప్రారంభిస్తామని అన్నారు. కడెం, ఎల్లంపల్లి, కొమురంభీమ్‌లలో ఇంటెక్‌వెల్‌లను నిర్మించి పైప్‌లైన్‌ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా చేస్తామన్నారు. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో మూడు రోజుల వ్యవధిలో పైప్‌లైన్ తవ్వకం పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. ఆయన ఇఇ రమేష్ ఉన్నారు.