మహబూబ్‌నగర్

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 7: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం పోలీసుకు అపారమైన శక్తిని, సూర్ఫిర్తిని ఇస్తుందని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మంగళవారం ట్రాఫిక్ పోలీసులకు మహబూబ్‌నగర్ ఆంధ్రాబ్యాంక్ వారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ మోటర్‌సైకిళ్లను ఉదారంగా ఇవ్వడంతో ఎస్పీ వాటిని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు శాంతికాముకులేకాక పోలీసులకు ఎంతో సహకారధోరణితో మసులుకుంటున్నారని అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పోలీసు చేసే కృషిని సమాజం గుర్తించి ఆదరించడం వలసన పోలీసు సిబ్బంది తమ కష్టాన్ని మరిచిపోతారని ఆమె పెర్కొన్నారు. గతంలోనూ జిల్లాలో కల్లోల పరిస్థితులు నెలకొని ఉన్న సందర్భంలో పోలీసు, ప్రజలు కలిసికట్టుగా సంఘ విద్రోహకశక్తులను ఎదుర్కొని ప్రశాంత వాతావరణాన్ని ఏర్పార్చుకున్నారని అన్నారు. ప్రస్తుతం మనదైన ప్రభుత్వ పాలనలో అభివృద్ధే ద్యేయంగా ముందుకు నడవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి స్ఫూర్తినిచ్చారు. ఆంద్రాబ్యాంక్ వారు శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ నిర్వహించేందుకు రెండు మోటర్ సైకిళ్లను విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పోలీసు శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఆంద్రాబ్యాంకు వారు ఇచ్చిన రెండు మోటర్ సైకిళ్లను ట్రాఫిక్ పోలీసులకు స్వాధీనపరుస్తూ మరింత చక్కటి పనితీరును కనబర్చాలని ఆమె కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ లీలాధర్, బ్రాంచ్ మేనేజర్ ప్రభు, డిఎస్పీ కృష్ణమూర్తి, ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తిరుపాజీ, పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్ పాల్గొన్నారు.