మహబూబ్‌నగర్

భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 7: జిల్లాలో భారీ వర్షాలే కురుస్తున్నాయి. ప్రతినిత్యం వివిద మండలాల్లో కురుస్తున్న వర్షాలు రైతాంగంలో ఖరీఫ్ ఆశలను చిగురింపజేశాయి. మంగళవారం తెల్లవారుజామున జిల్లాలోని దాదాపు 30 మండలాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసింది. వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్‌పేట మండలంలో ఏకంగా వరణుడు కరుణించడంతో 11సెం.మీ భారీ వర్షం కురిసింది. దింతో మండలంలోని చెరువులు, కుంటల్లోకి పెద్ద ఎత్తున వర్షపునీరు వచ్చి చేరింది. చెక్ డ్యాంలు, వాలుకట్టలు పొంగిపోర్లుతున్నాయి. ఎటుచూసిన రోడ్ల వెంట ఉన్నటువంటి గుంతల్లో వర్షపునీరు చేరింది. అంతేకాకుండా ఆమనగల్లు మండలంలో 6.8సెం.మీల భారీ వర్షం కురియడంతో ఈ మండలంలో కూడా కుంటలు, చెరువుల్లోకి ఓ మోస్తారు వర్షపునీరు వచ్చిచేరింది. వెల్దండ మండలంలో దాదాపు 9సెం.మీల వర్షపాతం భారీగా కురియడంతో రైతులు ఖరీఫ్ పంటల సాగుపై దృష్టి కేంద్రికరించారు. ఇది ఇలా ఉండగా మండలంలో ఇటివల కురిసిన వర్షాలతో కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. వనపర్తి, పాన్‌గల్, పెద్దకొత్తపల్లి మండలాల్లో కూడా 6 సెం.మీల వర్షం నమోదు అయ్యింది. దింతో వాగులు, వంకలు పారుతున్నాయి. అదేవిధంగా హన్వాడ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, ఉప్పునుంతల, లింగాల, కోడేర్ మండలాల్లో దాదాపు 5సెం.మీల వర్షం కురిసింది. ఖరీఫ్ ప్రారంభంలోనే ఇలాంటి వర్షం కురియడంతో రైతులకు ఖరీఫ్‌పై ఆశలు చిగురించాయి. గట్టు, బల్మూర్, అచ్చంపేట, తాడూర్, ఖిల్లాఘన్‌పూర్, కేశంపేట మండలాల్లో సైతం 3సెం.మీలకు పైగా వర్సం కురిసింది. అయితే జూన్ మాసం ప్రారంభం నుండే ప్రతినిత్యం జిల్లాలో ఎదో మండలంలో వర్షం కురుస్తుండడంతో భూగర్భజలాలు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. గత రెండేళ్ల నుండి జిల్లాలో తీవ్రమైన కరువు నెలకొనడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం దింతో వ్యవసాయం సంక్షోభంలోకి పడిపోవడంతో జిల్లా రైతాంగం దిక్కుతోచని స్ధితిలో పడింది. అయితే ప్రస్తుతం జూన్ మాసంలో 7.2సెం.మీ సాదారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే ఈ నెలలో 5.2సెం.మీల జిల్లాలో వర్షపాతం నమోదు అయ్యింది. ఇంకా ఈ నెల మరో 20 రోజులకు పైగా ఉండడంతో ఈ మాసంలో సాదారణ వర్షపాతం కన్నా అధికంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అసలు నైరుతి రుతుపవనాలకు సంబందించిన వర్షాలే కురియలేదని, రెండు మూడూ రోజుల్లో జిల్లాకు నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోపక్క రోహిణి కార్తిలోనే విత్తనాలు విత్తితే పంటలు బాగు దిగుబడి అవుతుందని రైతుల నమ్మకం. దింతో గత మూడు నాలుగు రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా రైతులు మొక్కజొన్న, కందులు, జొన్న, పత్తి తదితర వర్షాదార పంటలకు సంబందించిన విత్తనాలను పెద్ద ఎత్తున నాటుతున్నారు.