మహబూబ్‌నగర్

హరితహారాన్ని యజ్ఞంలా చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 7: యజ్ఞంలా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ మీటింగ్ హల్‌లో హరితహారంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో దాదాపు ఐదుకోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలోనే హరితహారం కార్యక్రమంలో ప్రథమస్థానంలో నిలవాలని సూచించారు. ప్రతి ఒక్కరు భాద్యతాయుతంగా సమాజంలో తన వంతుగా మొక్కలు నాటాలనే దృక్పథంతో ముందుకు వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో పచ్చదనం ఉంటేనే వానలు సంవృద్ధిగా కురుస్తాయని అందుకు జిల్లాలో 35శాతానికిపైగా పచ్చదనం ఉండేలా కృషి చేయాలన్నారు. గత సంవత్సరం వర్షాలు అంతంతమాత్రంగా కురిసినప్పటికిని పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 562 నర్సరీలలో మొక్కలు అందుబాటులో ఉన్నాయని 2.2కోట్ల మొక్కలు తక్షణమే నాటేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీల వారిగా సంబందిత శాఖల అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున ఆయా శాఖల అధికారులు ఇప్పటికే ఎంచుకున్న స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో 22వేల కిలో మీటర్ల పొడవున పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి రోడ్లు ఉన్నాయని వీటిని అనుసంధానం చేస్తూ జిల్లా వ్యాప్తంగా 60లక్షల మొక్కలు నాటేందుకు అవకాశం ఉందని వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సంబందిత అధికారులకు మంత్రి ఆదేశించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి పోషణ కూడా ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం కొనసాగుతున్నందున ఇదే కార్యక్రమంలో విద్యార్థులను హరితహారంపై దృష్టి మళ్లించి సమాజంలో చెట్ల ప్రాముఖ్యత గురించి వివరించాలన్నారు. ఫారెస్టు అధికారులు జిల్లాలో అడవులను మరింత పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రస్తుతం జిల్లాలో 16శాతం మాత్రమే అడవులు ఉన్నాయని వీటి సంఖ్య 35శాతానికి పెంచితే వాతావరణంలో సమతుల్యత ఏర్పడుతుందని ఆయన వెల్లడించారు. చెరువు కట్టలపై ఈత చెట్లను కూడా పెంచాలని దింతో గీతకార్మికులకు ఉపాధి లభిస్తుందని, ప్రజలకు కూడా స్వచ్చమైన కల్లు అందుతుందని ఇంగ్లీష్ మందులకు బానిస కాకుండా గ్రామీణ స్థాయిలో ప్రకృతి కల్లును ప్రజలు సేవించే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా డ్వామా అధికారులు ప్రత్యేక చోరవ చూపి గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉండే మొక్కలను ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లోని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటి ముందు ఒకటి రెండు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచులను పూర్తిగా భాగస్వామ్యం చేస్తే గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. అదేవిధంగా వ్యవసాయపొలాల గట్లపై కూడా రైతులు మొక్కలు నాటే అవకాశం ఉన్నందున రైతులకు పెద్ద ఎత్తున మొక్కలను సరఫరా చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగా అయితే సంఘటితంగా యావత్తు ప్రజానికం పాల్గొన్నారో అదే స్పూర్తితో తెలంగాణ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా ప్రజలు బాద్యతాయుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జేసి రాంకిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహరెడ్డి, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, డిఇఓ విజయలక్ష్మీబాయి, డిఎఫ్‌ఓ పాల్గొన్నారు.