మెదక్

శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 7: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లీం సోదరులు శాంతియుతంగా పండగను జరుపుకోవాలని సంగారెడ్డి డిఎస్పీ టి.తిరుపతన్న సూచించారు.మంగళవారం స్థానిక టిఎన్జీవోస్ భవన్‌లో శాంతి కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు మత సామరస్యంతో పండుగను జరుపుకోవాలన్నారు. ముస్లీం సోదరులు ఉపవాసంతో ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా బాగోద్వేగాలకు గురికావద్దన్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపించినా, ఎమైన సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంతంగా పండగను జరుపుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా మత పెద్దలు బాధ్యత వహించాలన్నారు. ఎప్పటికప్పుడు పర్యవెక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిఐ రామకృష్ణారెడ్డి, రూరల్ సిఐ నరేందర్, కొండాపూర్ సిఐ ఆంజనేయులు, ట్రాఫిక్ సిఐ మస్తాన్ అలీ, మైనార్టీ మత పెద్దలు, వివిధ పార్టీలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.