మెదక్

రెండేళ్ల పాలనలో చేసింది శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దుర్తి, జూన్ 7: టిఆర్‌ఎస్ రెండెల్లపాలనలో ప్రచారాలు, ఆర్భాటాలే తప్ప ప్రజలకు చేసేంది ఏమిలేదని మాజీ మంత్రి, ప్రస్తుత డిసిసి జిల్లా అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెల్దుర్తి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన సందర్భంగా అమె మాట్లాడారు. కేజీ టు పీజీ అని నేటికి అచరణలో లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే విద్యార్థులకు లబ్ధి చేకూరిందని, ఫీజు రీయంబర్స్‌మెంట్ వల్లే అనేకమంది విద్యార్థులు పైచదువులు చదివారని నేడు అదే విద్యార్థులు అనేక మంది మధ్యలోనే చదువుకు దూరమయ్యారని అమె విమర్శించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రూణాలను కాంగ్రస్ ఇస్తే నేడు టిఆర్‌ఎస్ పాలనలో ఒక్క గ్రూప్‌నకు కూడా ఇచ్చిన దాఖలాలులేవన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల్లు ఇస్తే అప్పటి బిల్లులు నేటికీ ఇవ్వకపోవడంతో అనేక మంది అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు. అడపిల్లల సంరక్షణ కోసం బంగారు తల్లిని ప్రవేశపెడితే ఆ పథకాన్ని తుంగలో తొక్కిందన్నారు. సమగ్ర సర్వేపేరిట వలస పోయిన ప్రజలను రప్పించుకొని వారికి వచ్చే అనేక పథకాలను కాజేసిందని అమె తెలిపారు. టిఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఏ మేనిపెస్టోతో ప్రజల ముందుకు వెళ్లిందో అదే ఎన్నికల ప్రణాళికను ప్రజల వద్దకు తీసుకెళ్తామన్నారు. ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని కొదండరామ్‌పై నేడు టిఆర్‌ఎస్ మంత్రులు, ఎంపిలు దుమ్మెత్తి పోయడం సమంజసం కాదన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన ఉద్యమాన్ని మర్చిపోకముందే అయనను నేడు ఆదే నాయకులు నియంతగా వర్ణించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే పట్టుకొమ్మలని వారులేనిదే పార్టీలేదని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రాబోయే 2019 ఎన్నికల్లోపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి విజయం వైపుకు దుసుకెళ్తామన్నారు. ప్రతి మండలంతో పాటు గ్రామగ్రామాన కమటీలను వేసి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తిసుక వచ్చేవిదంగా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడిగె నర్సింలు, జయరామ్‌రెడ్డి, రాజీరెడ్డి, నర్సింహారెడ్డి, సుధాకర్‌గౌడ్, శంకర్‌గౌడ్, శేఖాగౌడ్, మల్లెశం, నర్సింలు, అశోక్‌గౌడ్, ఖాజామైనోద్ధీన్, శ్రీనివాస్‌రెడ్డి, నంబూద్రి గుప్తతో పాటు ఆయాగ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.