కరీంనగర్

రాష్ట్రాన్ని హరితవనంగా మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా రాష్ట్రాన్ని హరితవనంగా మారుస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి హరితహారంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3.5 కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ఆ గ్రామంలో ఎవరెవరికి ఎన్ని మొక్కలను ఇస్తున్నారో గ్రామ పంచాయతీ బోర్డుపై రాయాలని తెలిపారు. పాఠశాలల్లో పాఠశాల కమిటి నిర్వహణ ద్వారానే గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం వంటి నిర్వహణ చేయించాలని సూచించారు. మొక్కల సంరక్షణకు ఉపాధిహామీ ద్వారా ఒక వ్యక్తిని నియమించనున్నట్లు, 50 మొక్కల నిర్వహణకు ఒక వ్యక్తి చొప్పున నియమించుకోవచ్చని తెలిపారు. గ్రామలలో హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హరితహారం పథకంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో నాటనున్న మొక్కల లక్ష్యంపై మంత్రి సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ లక్ష్యాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని సూచించారు. పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేయాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పూర్తి భాగస్వాములు కావాలని సూచించారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సాంస్కృతిక సారథుల ద్వారా హరితహారంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ సౌజన్యంతో కళా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధు, బొడిగ శోభ, జెసి పౌసమి బసు, జడ్పీ సిఇఓ సూరజ్ కుమార్, డిఆర్‌ఓ వీరబ్రహ్మయ్య, సిపిఓ సుబ్బారావు, డ్వామా, డిఆర్‌డిఎ పిడిలు గణేష్, అరుణశ్రీ, ఆర్‌డిఓ చంద్రశేఖర్, అటవీశాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.