వరంగల్

సాదాబైనామాపై అవగాహన కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూన్ 7: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమం ద్వారా అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారిణి శోభారాణి కోరారు. సాదాబైనామా కార్యక్రమంపై మంగళవారం జనగామలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. మీసేవల ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తులను తీసుకోవాలన్నారు. 2జూన్ 2014కు ముందు ఇతర రైతుల నుంచి వ్యవసాయ భూములను సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుందని అన్నారు.
గ్రామాల్లో నివాసముండని సంబంధిత యజమానులకు వారి బంధువుల ద్వారా ఈ విషయాన్ని తెలియచేయాలని సూచించారు. ఐదెకరాల భూమి కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే క్రమబద్ధీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వీకరించిన దరఖాస్తుల పరిశీలనలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నామమాత్రంగా పరిశీలించి క్రమబద్ధీకరిస్తే తదనంతరం జరుగబోయే పరిణామాలకు సంబంధిత ఉద్యోగులే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, ప్రభుత్వ భూములకు ఈ పద్ధతి వర్తించదని తెలిపారు. రైతుల్లో అవగాహన కల్పించినప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని, అందుకే గ్రామస్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆర్డీవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామాల్లో పాసుపుస్తకాలు లేని రైతులను గుర్తించి, క్రమబద్ధీకరణకు ఎంతమంది అర్హులో రికార్డుల ఆధారంగా తెలుసుకొని వెంటనే నివేదిక అందించాలని కోరారు. ఈ సమావేశంలో డివిజన్‌లోని అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, విఆర్వోలు, ఐకెపి అధికారులు పాల్గొన్నారు.