వరంగల్

టీచర్ల గైర్హాజరుకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపట్టబోతోంది. అందులో భాగంగా ముందుగా టీచర్లపై కొరడా ఝుళిపించనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ వృత్తితో పాటు అనేక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, నెలవారి చిట్టీలతో పాటు ఇతర వృత్తుల్లో కూడా కొనసాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు రాకపోవడమే కాకుండా మరికొన్ని పాఠశాలల్లో వంతుల వారీ డ్యూటీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అన్ని పాఠశాలల్లో బయో మెట్రిక్ విధానం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుండే ఈ విధానం అమలు చేయబోతున్నారు. దీంతో ఉపాధ్యాయులు సకాలంలోనే పాఠశాలలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మొదటి విడతగా 25 శాతం పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. దీంతో బడులకు పంగనామం పెట్టే ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉపాధ్యాయుల వల్లే సర్కార్ పాఠశాలలు ఆశించినంత ఫలితాలు రావడం లేదనే విద్యాశాఖ ఈ సంవత్సరం బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఉపాధ్యాయులు ఏ టైంకు పాఠశాలకు వచ్చేది వెళ్లేది స్పష్టం కానుంది. జిల్లాలో ఉన్న దాదాపు 4వేల ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతగా వెయ్యి పాఠశాలల్లో ఈ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా మొదటి సారిగా వరంగల్ జిల్లాలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కూడా ఈ విద్యా సంవత్సరమే ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఏది ఏమైనా బయోమెట్రిక్ విధానం సత్ఫలితాలు ఇస్తాయనే సర్వత్రా చర్చ జరుగుతోంది.