రంగారెడ్డి

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 7: గచ్చిబౌలిలో మంగళవారం సాయంత్రం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 15 నిముషాలలోపే మూచు చోట్ల చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు మహిళలకు చెందిన సుమారు 5 తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. విప్రోలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అశ్విని విధులు ముగించుకొని కాలినడకన మెయిన్ రోడ్డుకు వస్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి మెడలోని చైన్‌ను లాక్కెళ్లారు. ఒ ఫర్లాంగ్ దూరంలోనే మరో మహిళ కార్వి ఆఫీసు ముందు నుంచి వస్తున్న మరో మహిళ కల్పనాలత మెడలోని గొలుసును లాక్కెళ్లారు. అంతటితోనే ఆగకుండా మళ్లీ గచ్చిబౌలి వైపు వస్తూ మరో మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.