హైదరాబాద్

ఒకే రోజు 25లక్షల మొక్కలు నాటనున్న గ్రేటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: మహానగరంలో మరింత పచ్ఛదనాన్ని పెంపొందించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు మహానగర పాలక సంస్థ వచ్చే నెల 11వ తేదీన పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.
గ్రీన్ డేగా పిలుచుకునే ఈ ఒక్కరోజే సుమారు 25లక్షల మొక్కలను నాటి, గిన్నీస్ రికార్డును సాధించనున్నట్లు తెలిపారు. ఐటి కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, శ్మశానవాటికలు, ఖాళీ స్థలాలు, రహదారులతో పాటు ఖాళీగా ఉన్న ప్రతి చోట మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుత సంవత్సరంలో హైదరాబాద్ నగరం ఔటర్ రింగురోడ్డు పరిధిలో కొటి మొక్కలను నాటాలన్న లక్ష్యంలో భాగంగా వచ్చే నెల 11వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక, ఆ రోజు నుంచి వివిధ రకాల మొక్కలను ఆసక్తి కల్గిన నగరవాసులకు, స్వచ్ఛంద సంస్థలకు జిహెచ్‌ఎంసి తరపున పంపిణీ చేస్తామన్నారు. ఈ మహోన్నత కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, అధికార యంత్రాంగం కూడా తమవంతు బాధ్యతగా పాల్గొని, నగరంలో పచ్ఛదనాన్ని పెంపొందించేందుకు సహకరించాలని కమిషనర్ కోరారు.