రంగారెడ్డి

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, జూన్ 7: బడంగ్‌పేటలో మార్చి 18న దారుణ హత్యకు గురైన నాగలక్ష్మి మృతి మిస్టరీని మీర్‌పేట పోలీసులు చేధించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎల్బీనగర్ డిసిపి మక్బుల్ ఇక్బల్ వివరాలను వెల్లడించారు. నాగలక్ష్మి తన ఇద్దరు కుమారులతో బడంగ్‌పేటలో నివాసముంటుంది. ఆటో డ్రైవర్ సుబ్రమణ్యం తన కుమారులను నిత్యం పాఠశాలకు తీసుకువెళ్లి వచ్చేవాడు. కొన్నాళ్ల క్రితం డ్రైవింగ్ వృత్తిని వదిలి బిస్కెట్ కంపెనీలో పనికి చేరాడు. అక్కడే పని చేస్తున్న యాదమ్మతో పరిచయమయింది. ఇరువురు వివాహం చేసుకొని డిఆర్‌డిఒలో కాపురం పెట్టారు. ఇరువురు కలిసి మార్చి 18న బడంగ్‌పేటలో నివాసముంటున్న నాగలక్ష్మి వద్దకు వెళ్లి రెండు వేల రూపాయలను అడిగారు. ఆమె తన వద్ద లేవని బదులిచ్చింది. ఇంట్లో ఎవరులేని సమయాన్ని అదునుగా భావించిన దంపదులిద్దరు నాగలక్ష్మిని దారుణంగా హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తస్కరించారు. మేడ్చల్‌కు వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. యాదమ్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సుబ్రమాణ్యం పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి లక్షాయాభై వేల విలువైన సొత్తును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసిపి వేణుగోపాల్, వనస్థలిపురం ఏసిపి భాస్కర్ పాల్గొన్నారు.