హైదరాబాద్

ఔత్సాహిక క్రీడాకారులకు కేంద్రం చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, జూన్ 7: ఔత్సాహిక క్రీడాకారులు, పర్వతారోహణ పట్ల ఆసక్తి కల్గిన యువతను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని నెహ్రు యువ కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్‌రావుతెలిపారు. హిమాలయ పర్వతాలలో 5226 మీటర్ల ఎత్తు కల్గిన వౌంట్‌నార్బు పర్వతాన్ని అధిరోహించి ఈ నెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను పర్వతంపై జాతీయ జెండా, తెలంగాణ పటం, తెలంగాణ జాగృతి జెండాను ఆవిష్కరించిన ఏడుగురు పర్వతారోహకులను ఆయన మంగళవారం సికిందరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు.
ఈ సందర్భంగా పేరాల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం గ్రామగ్రామాల నుంచి కూడా క్రీడలను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ కల్చర్ ప్రభావం కారణంగా నేడు సాంప్రదాయ ఆటపాటలు, సాహస క్రీడలు కనుమరుగైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నార్బో పర్వతాన్ని అధిరోహించి, అక్కడ తెలంగాణ సంబరాలైన బతుకమ్మ వంటివి నిర్వహించిన ఈ ఏడుగురు పర్వతరోహకులు నేటి యువతకు ఆదర్శవంతులని వ్యాఖ్యానించారు. అనంతరం ‘ఏక్ట్స్’వ్యవస్థాపకులు, కేంద్ర పర్వతారోహణ సంస్థ సభ్యుడు కె. రంగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంగోతు తుకారం, నిరుడి ప్రవీణ్‌కుమార్, సుధీర్‌సింగ్, అర్కవల్లి సత్యనారాయణ, మాలోత్ రాజశేఖర్‌నాయక్, ముక్‌పాల్కర్ విశాల్ శర్మ, బాసా నితిన్‌రావు నార్బు పర్వతారోహణకు తెలంగాణ జాగృతి సంస్థ ఎంతో సహాయసహకారాలు అందించిందని తెలిపారు.
ఈ ఏడుగురు పర్వతారోహకులతో కూడిన బృందం తన నేతృత్వంలో గత రెండో తేదీన ఉదయం ఎనిమిదిన్నర గంటలకు నార్బు పర్వతాన్ని అధిరోహించి, తెలంగాణ నినాదం చేసినట్లు రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెహ్రు యువ కేంద్ర సంఘటన్ జోనల్ డైరెక్టర్ ఝాన్సీ పాల్‌సింగ్, హైదరాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ వెంకటేశ్, నిజాంబాద్ జిల్లా ఇన్‌ఛార్జి రామచంద్రన్ పాల్గొన్నారు.