పశ్చిమగోదావరి

సిబ్బంది పిల్లల ప్రతిభకు ఎస్పీ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, జూన్ 7: కిందిస్థాయి ఉద్యోగుల బాగోగులు చూసే పోలీసు అధికారిగా ఎస్పీ భాస్కర్‌భూషణ్ పేరుపొందారు. ఇప్పటివరకు జరగని రీతిలో పోలీస్‌శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లల ప్రతిభను ప్రోత్సహించే దిశగా అడుగులు వేశారు. ఇటీవల జరిగిన పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను ఆయన అభినందించారు. జిల్లాలోని సుమారు 80 మంది పదవతరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించారు. ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డివి రమణ కుమార్తె ఉష ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో 9.5 గ్రేడు సాధించింది. ఆకివీడులోని ఆదిత్య ఇంగ్లీషు మీడియం పబ్లిక్ స్కూల్లో ఉషతో పాటు పలువురు ఉద్యోగుల పిల్లల్ని ఎస్పీ కార్యాలయానికి పిలిచి తల్లిదండ్రుల సమక్షంలో ప్రత్యేక షీల్డు, ప్రశంసాపత్రాలు అందించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నతస్ధాయికి ఎదగాలని ఆశీర్వదించారు. అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌తో పాటు పోలీస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నాగరాజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.