పశ్చిమగోదావరి

మరో ఎటిఎం మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 7: మీ ఎటిఎం కార్డు రెన్యువల్ చేయాలి, కార్డు నెంబరు చెప్పమని కాల్ రాగా నమ్మి నెంబరు చెప్పడంతో రూ.18వేలు మరో ఖాతాకు మళ్లించిన సంఘటన మంగళవారం పోలవరం మండలంలో చోటుచేసుకుంది. నూతనగూడెంనకు చెందిన జల్లేపల్లి సుబ్బలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం ఫోన్ రావడంతో ఆమె భర్త రామచంద్రరావు మాట్లాడగా ‘హైదరాబాద్ ఎస్‌బిఐ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఎటిఎం కార్డు రెన్యువల్ చేయాలి, నెంబరు చెప్పమని’ అవతలి వ్యక్తి అడిగాడు. దీంతో సీక్రెట్ నెంబరు కదా ఎలా చెప్పను అని రామచంద్ర అనుమానం వ్యక్తంచేయడంతో.. ఆ నెంబరు కాదు, 16 అంకెల కార్డు నెంబరు మాత్రమే చెప్పాలని కోరటంతో రామచంద్రరావు నమ్మి ఆ కార్డు నెంబరు చెప్పడంతో సుబ్బలక్ష్మి ఖాతా నుండి మూడు అకౌంట్లకు రూ.18,280 ఆన్‌లైన్ ద్వారా మళ్లింపు జరిగినట్టు మెసేజ్‌లు వచ్చాయి. ఆ వెంటనే మరో కాల్ రాగా, రామచంద్రరావుతో అవతలి వ్యక్తి మాట్లాడుతూ జైపూర్ నుండి మాట్లాడుతున్నాను.. ఎస్‌బిఐ ఎటిఎం మానిటరింగ్ వింగ్ అధికారినని, మీ ఖాతా నుండి 18వేల 280 రూపాయలు వేరే ఖాతాకు మళ్లాయని, మీరు తక్షణం అందుబాటులో ఉన్న ఎస్‌బిఐకి వెళ్లి బ్రాంచి మేనేజర్‌తో నన్ను మాట్లాడించండి అనటంతో హుటాహుటిన బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మానిటరింగ్ అధికారితో మాట్లాడటంతో మేనేజర్‌తో ఆయన మాట్లాడుతూ జల్లేపల్లి సుబ్బలక్ష్మి ఖాతా నుండి ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా వస్తువులు కొని రూ.5000, రూ.5000, రూ. 8,280 మూడు ఖాతాలకు మళ్లాయని, ఆ కంపెనీ వారితో మాట్లాడి ఆ వస్తువులు డెలివరీ కాకుండా ఆపుచేయించానని, త్వరలో విత్‌డ్రా అయ్యే సొమ్ము సుబ్బలక్ష్మి ఖాతాకు జమవుతుందని వివరించారు. ఆ తరువాత బ్యాంక్‌కు మూడు కంపెనీల నుండి ఫ్యాక్స్ ద్వారా లెటర్లు వచ్చాయి. త్వరలో మీ అకౌంట్‌కు రూ.18,280లు జమవుతాయని సదరు కంపెనీల నుండి లెటర్లు పంపించారు. మానిటరింగ్ అధికారులు స్పందించడంతో తన డబ్బులు పోలేదని, తెలియని నెంబరు నుండి కాల్ వచ్చి ఎటిఎం కార్డు నెంబరు అడిగితే చెప్పవద్దని రామచంద్రరావు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.