పశ్చిమగోదావరి

దళితుల అభ్యున్నతే ప్రధాని ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జూన్ 7: దళితులు, బడుగు వర్గాలు కలిసి సమీకృత అభివృద్దిని సాధించాలని బిజెపి రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆడిటోరియంలో మంగళవారం దళిత యువ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. దళిత మోర్ఛ జిల్లా అధ్యక్షులు బూసి బెనర్జీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘురాం మాట్లాడుతూ బడుగుల అభ్యున్నతే ధ్యేయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ప్రగతి సాధించాలన్నారు. దేశ సమగ్రాభివృద్ధికి మోదీ బాటలు వేస్తున్నారన్నారు. గతంలో వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వ పాలనలో గ్రామీణ సడక్ యోజన, స్వర్ణచతుర్భుజి పథకాలు అమలు ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. నిజాయితీపరుడైన మంత్రి మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభినందించారన్నారు. సమరసత సేవావేదిక రాష్ట్ర సమన్వయకర్త సదాశివం మాట్లాడుతూ అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్ గొప్ప జాతీయవాదులని, వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో అణగారిన దళిత, బడుగు వర్గాలను సమాజంతో అనుసంధానం చేసినపుడే నిజమైన అభివృద్ది జరుగుతుందన్నారు. దళిత నేతలు తెనే్నటి సంజయ్‌ఖాన్, తానేటి ఆనందరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమూల మార్పులు రావాలన్నారు. దళితనేత చీకటిమిల్లి మంగరాజు అంబేద్కర్‌పై గీతాలను ఆలపించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ బిజెపి పక్ష నేత యెగ్గిన నాగబాబు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెదపోలు వీరరాఘవులు, మాజీ కౌన్సిలర్లు శీలి వెంకటాచలం, చలంచర్ల మురళి, యాళ్ల నాగేశ్వరరావు, బీజేపీ పెంటపాడు మండల అధ్యక్షులు వీర్ల గోవింద్ పాల్గొన్నారు.