పశ్చిమగోదావరి

నిబంధనలు పాటించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 7 : జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కచ్చితంగా నిబంధనలను పాటించాలని లేనిపక్షంలో పాఠశాలలను మూసివేయడంతోపాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని డిఇఓ డి మధుసూధనరావు తెలిపారు. స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1235 గుర్తింపు పొందిన ప్రవేటు పాఠశాలలు వున్నాయన్నారు. వీటిపై తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా అధికంగా ఫీజులు వసూలు చేయడం వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. దీనిపై నలుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేశామని, మండల స్థాయిలో ఎం ఇవో అధ్యక్షతన మండల కేంద్ర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండలంలోని సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, ఒక ఎన్‌జివో ఈ కమిటీలో సభ్యులుగా వుంటారని తెలిపారు. ఈ కమిటీ ఆయా ప్రాంతాల్లోని ప్రైవేటు విద్యాసంస్థలను పరిశీలిస్తుందని తెలిపారు. ఈ నెల 7 నుంచి ఈ తనిఖీలను ప్రారంభించామని, 10వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయన్నారు. అధికంగా ఫీజులు వసూలు చేయడం, అర్హులైన ఉపాధ్యాయులను నియమించకపోవడం, ఆట స్థలం లేకపోవడం, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించకపోవడం, ఆడిట్ చేయించకపోవడం, తక్కువ వయస్సు వున్న వారిని పై తరగతుల్లో చేర్చుకోవడం, ఫీజులు నోటీసు బోర్డుల్లో ప్రకటించకపోవడం, ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేయడం, కార్మిక చట్టాలను అనుసరించకపోవడం వంటి అంశాలపై ఈ తనిఖీలు జరుగుతాయన్నారు. అలాగే డి ఇవో అనుమతి లేకుండా జిల్లాలో ప్రీ నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి స్కూల్లు నిర్వహించడం చట్ట రీత్యా నేరమని తెలిపారు. ఈ విధంగా నిర్వహించే వారు జూన్ 30వ తేదీ లోగా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలని, లేనిపక్షంలో స్కూళ్లను మూయించి వేస్తామని తెలిపారు. పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ఉన్న నిబంధనలను పాటించి తీరాలని తెలిపారు. బుధవారం జరగనున్న నవ సంకల్ప దీక్షలో జిల్లాలోని ఉపాధ్యాయులంతా పాల్గొనాలని సూచించారు. ఏలూరు, ఏలూరు రూరల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఏలూరులో నిర్వహించే దీక్షలో పాల్గొనాలని తెలిపారు. అలాగే మండలాల్లోని ఉపాధ్యాయులు ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించే దీక్షలో పాల్గొనాలని తెలిపారు. ఉపాధ్యాయ లోకం నుంచి దీక్షా శిబిరం వద్ద హాజరు తీసుకుంటామని తెలిపారు.