విజయనగరం

రైతు బజార్ వినియోగమెప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, జూన్ 7: పట్టణవాసులు, మండల పరిసర ప్రాంతాల రైతులు ఎప్పుడా అని ఎదురు చూసినా రైతు బజారు ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి ప్రారంభించి 20రోజులపైగా కావస్తున్నా వౌలిక సదుపాయాలు లేక వినియోగంలోకి రాలేదు. ప్రజల సౌకర్యార్థం స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ పక్కన మార్కెటింగ్ నిధులు 12 లక్షల రూపాయలతో షెడ్లు మాత్రం నిర్మించారు. దీనికి చుట్టూ ప్రహారీ, లోపల రోడ్లు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి వౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది. స్టాల్స్‌కు ఎటువైపు గోడలు లేవు అంతేకాకుండా ఎస్టేట్ ఆఫీసర్ గది, స్టోర్ రూమ్, నైట్‌వాచ్‌మెన్ గదులు లేవు. ఇవేవీ లేకుండానే తూతూ మంత్రంగా రైతుబజారు ప్రారంభించారు. గానీ ఇక్కడ ఎటువంటి క్రయ విక్రయాలు నేటికీ జరగడంలేదు. రైతులు ఎప్పటిలాగే పాతబస్టాండ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్మడంతో రోజు ఈ ప్రాంతం రద్దీగా మారి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో లక్షలు ఖర్చుచేసి నిర్మించిన రైతు బజారు వృధాగా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా వౌలిక సదుపాయాలు కల్పించి రైతు బజారు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.