కృష్ణ

విద్యాభివృద్ధితోనే సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూన్ 7: దేశాభివృద్ధి విద్యాభివృద్ధితోనే ఎక్కువ ముడిపడి ఉందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీఇరానీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు విద్యార్థులు కీలక భూమిక పోషించాలన్నారు. గత ప్రభుత్వాలు విస్మరించిన విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేసి సంస్కరణలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు చోటు కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని కెబిఎన్ కళాశాలలో మంగళవారం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. మన దేశ ఘన చరిత్రను, సంస్కృతిని చాటి చెప్పిన వేద విద్యకు ప్రాధాన్యత తగ్గుతున్న సమయంలో వాటిని నేటి తరం విద్యార్థులతో పాటు రానున్న తరం విద్యార్థులకు అందించాల్సి ఆవశ్యకత ఉందన్నారు. వందల సంవత్సరాల క్రితమే మన విద్యను ప్రపంచ దేశాలు గుర్తించాయని పలు ఉదాహరణలతో వివరించారు. 30 సంవత్సరాలుగా విద్యారంగాన్ని గత ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం ఏడాది కాలంలోనే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్సులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఒక నూతన యాప్ రూపొందిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులు మరింత సౌకర్యవంతంగా వారి వారి పాఠాలు వినవచ్చన్నారు. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులను రప్పించి మన కళాశాలల్లో వారితో పాఠాలు చెప్పిస్తామని తెలిపారు.
విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థి దేశం కోసం నడుం బిగించి సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు సహకారం అందించాలన్నారు.