కృష్ణ

సమస్యల సుడిలో రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: సమస్యల సుడిగుండంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోందని, అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాంఘిక సంక్షేమం, సాధికారిత, నైపుణ్యాభివృద్ధి చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్దామని, రాష్ట్భ్రావృద్ధికి అందరూ భుజం భుజం కలిపి నడవాలన్నారు. అంతర్జాతీయ రాజధాని నిర్మాణమే తన లక్ష్యమని, పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరతామని, కరవుకు చెక్ పెడతామని పేర్కొన్నారు. దేశంలోని అగ్ర జిల్లాల్లో కృష్ణా జిల్లా ఒకటిగా ఉండాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. టెక్నాలజీ ద్వారా అవినీతికి చెక్ పెట్టామని, అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఆర్టీసీలో జిపిఎస్ పద్ధతి ప్రవేశపెట్టామని, 43 శాతం ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇచ్చిన ప్రభుత్వం టిడిపి అన్నారు. కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మంజునాధన్ కమిటీ వేశామన్నారు. అగ్రవర్ణాల్లో పేదవారికి చేయూతనివ్వడంతోపాటు రిజర్వేషన్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆరు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, గ్రామాల్లో నాలుగు లక్షలు, సిటీలో రెండు లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను మెరుగుపరచి డాక్టర్లను జవాబుదారీ చేస్తామన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తామని, వారు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్‌కు పంపేలా చర్యలు చేపడతామని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా సిటీ స్కాన్ తప్ప మిగిలిన అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. కార్మికులకు అసంఘటిత కార్మికుల బీమా పథకం వర్తింపజేశామని అన్నారు. పేదవారికి అండగా ఉండాలన్న లక్ష్యంతో 208 రోజులపాటు పాదయాత్ర చేశామని, పాదయాత్రలో ప్రజల అవస్థలు, అవసరాలు తెలుసుకున్నానని అన్నారు. ఇప్పటికీ ఆ సంఘటనలు కళ్లల్లో మెదలుతున్నాయని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం అన్నారు. అంగన్‌వాడీల ద్వారా మహిళాభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్నామన్నారు. ఆడపిల్లలపై వివక్ష తగదని, పుట్టడానికి ముందే వారిని చంపేయడం నేరమన్నారు. మగ పిల్లలను చదివించి ఆడపిల్లలను చదివించకుండా వివక్ష చూపుతున్నారన్నారు. మహిళలు ఆత్మ గౌరవంగా బతకడానికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీల నుండి రక్షించామన్నారు. 12 కోట్ల రూపాయలతో ఎనిమిది వసతి గృహాల నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు లబ్ధిదారులతో సిఎం నేరుగా మాట్లాడి వారు పొందిన లబ్ధిని తెలుసుకున్నారు. ఆడపిల్లలను చంపవద్దని చిన్నారి పల్లవి పాడిన పాటను ఆయన అభినందిస్తూ సత్కరించారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన భద్రయ్యను, కోచ్ శేఖర్‌బాబును సత్కరించి అభినందనలు తెలిపారు. అంగన్‌వాడీ పాఠశాలల్లో చిన్నారులను ఆయన అభినందించారు. చిన్నారులు చేసిన అంగన్‌వాడీ ప్రతిజ్ఞను ఆయన మెచ్చుకున్నారు. చిన్నారులకు ప్రీ స్కూల్ డిగ్రీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు రావెల కిషోర్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ళ నారాయణ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు బుద్దా వెంకన్న, డాక్టర్ ఎఎస్ రామకృష్ణ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా.జి.సృజన, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.