కృష్ణ

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: రాష్ట్రంలో సమ సమాజ నిర్మాణానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. నగరంలోని ఏ కనె్వన్షన్ సెంటర్‌లో నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలు, రానున్న కాలానికి ప్రగతి సన్నాహాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అట్టడుగు ప్రజలకు అందాలని, సంక్షేమం అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలన్నారు. అన్యాయంగా, అక్రమంగా రాష్ట్రాన్ని విడదీశారని, వౌలిక సదుపాయాలు లేని రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. నదుల అనుసంధానం, రైతు రుణమాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరా, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవల మెరుగుతో అనేక విజయాలు సాధించామన్నారు. ఎస్‌సి వర్గాల అభ్యున్నతికి ఉప ప్రణాళికగా 8,724 కోట్లు కేటాయించగా, ఎస్‌టి వర్గాల అభ్యున్నతికి 3,100 కోట్ల నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామన్నారు. సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై రాష్టవ్య్రాప్తంగా పర్యటించి అవగాహన కల్పించానని ఆయన తెలిపారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో వారంలోపే 90 శాతం పింఛన్లను లబ్ధిదారులకు అందించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అందించని విధంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. దివంగత ఎన్టీ రామారావు 1985-86 సంవత్సరంలోనే రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశారని అన్నారు. నాటి పునాది కారణంగా నేడు విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర సర్వీసు పోటీ పరీక్షల్లో 90కి పైగా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. చంద్రన్న సంచార వైద్యశాల, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రభుత్వం పేదలకే అందిస్తుందని, పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వివరించారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ 16,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో టెక్నాలజీ ఉపయోగించి నిధులు దారి మళ్లకుండా అసలైన లబ్ధిదారులకే చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన పైలెట్ ప్రాజెక్టులను జిల్లా నుండే మొదలుపెట్టడం మనకు గర్వకారణమన్నారు.
క్యాపిటల్ ఇన్‌క్లూజన్‌లో భాగంగా మహిళలకు 3 వేల రూపాయల చొప్పున రెండు దశల్లో 1900 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అందించినట్లు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈపోస్ విధానాన్ని అమలుచేసి 25 శాతం ఆదా చేస్తున్నామని, ఆదా చేసిన దాంట్లో లక్ష మందికి అదనంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో లక్షా 30 వేల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో 80 కోట్ల రూపాయల ఖర్చుతో 40 వేల మరుగుదొడ్లు నిర్మించామన్నారు. దేశంలోనే మన జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించి గ్రీన్ ఛానల్‌లో పెట్టారన్నారు. అద్దె భవనాల్లో ఉంటున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐఎస్‌ఎల్ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 46 లక్షల మంది జనాభా ఆధార్ నెంబర్ సహా అన్ని వివరాలు సేకరించి జూలై నాటికి పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ముస్లిం వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనార్టీ వర్గాల సాధికారత దిశగా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ నిధులను ముస్లింల అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఈ ఏడాది మైనార్టీల సంక్షేమానికి 710 కోట్లు కేటాయించామన్నారు. మసీదుల మరమ్మతులకు ప్రభుత్వం అన్ని జిల్లాలకు గ్రాంటు కేటాయించిందని, దుల్హాన్ పథకం ద్వారా ఈ ఏడాది ఆడపిల్లల పెళ్లి ఖర్చుకు 55 కోట్ల రూపాయలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా.జి.సృజన, అధికారులు పాల్గొన్నారు.