శ్రీకాకుళం

జాతీయ రహదారిలో... 36 ప్రమాద జంక్షన్ల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జూన్ 7: జిల్లాలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని దీనికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ జె బ్రహ్మారెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌స్టేషన్, క్వార్టర్స్‌లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. జిల్లాలో ప్రతీ ఏడాది సుమారు 532మందికి పైగా రోడ్డు ప్రమాదంలోనే మరణిస్తున్నట్లు గుర్తించామని దీని నివారణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈమేరకు రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిపై 36 ప్రమాద కూడళ్లను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత నిఘా పెంచుతామన్నారు. జిల్లాలో కానిస్టేబుల్స్, ఎస్‌ఐ నియామకాలు చేపట్టవలసి ఉందని గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి నియామకాలు జరగలేదని స్పష్టంచేశారు. దీనికి సంబంధించి నియామక ఉత్తర్వులు జారి అయితే పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసుకునేందకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో డీ ఎస్పీ భార్గవరావునాయుడు, సిఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ ఎన్ లక్ష్మణ్ పాల్గొన్నారు.