అనంతపురం

స్ర్తిశిశు సంక్షేమ శాఖకు అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూన్ 7 : రాష్ట్రంలోని 13 జిల్లాలో అదనంగా 700 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారని స్ర్తిశిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ స్వర్ణలత తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గుత్తి ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ జెడి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్ర్తిశిశు సంక్షేమ శాఖకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గించి ఆరోగ్యవంతమైన బిడ్డల పెరుగుదలకు ప్రభుత్వం ప్రాథమిక దశ నుంచే అవసరమైన ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ప్రత్యేకించి గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టుకు 61 కొత్త భవనాలు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల మాదిరే ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అమలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకూ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా అంగన్‌వాడీలపై ఉందన్నారు. గ్రామ పరిధిలోని రెండు, మూడు అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలను మూసివేస్తామన్నారు. కనుక గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీలు గ్రామంలోని ప్రతి పిల్లవాడినీ కేంద్రానికి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పౌష్ఠికాహారం పక్కదారి పడుతున్నట్లు ఇప్పటికే తమకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. బాలికల ఆరోగ్య పరిరక్షణ ఆయా గ్రామాల్లో పని చేస్తున్న ఆశావర్కర్లతో సమన్వయమై అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గుత్తి ప్రాజెక్టు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన అంగన్‌వాడీలు, హెల్పర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపిడిఉషతోపాటు అంగన్‌వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.