అనంతపురం

ఎరువుల దుకాణంపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూన్ 7 : పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న మన గ్రోమోర్ ఎరువుల దుకాణంపై మండల వ్యవసాయాధికారి వెంకట్రాముడు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణానికి సంబంధించిన రికార్డులు, స్టాక్ రిజిష్టర్‌లు పరిశీలించారు. గోడౌన్‌లో రికార్డులను పొందుపర్చకుండా నిల్వ ఉంచిన రూ.1.70 కోట్ల విలువజేసే ఎరువులను సీజ్ చేయడంతోపాటు ప్రభుత్వ అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.30 లక్షల కావేరీ పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మన గ్రోమోర్ కంపెనీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు నిల్వలపై అవసరమైన సమాచారాన్ని రైతులు, అధికారులకు అందుబాటులో ఉంచాల్సి ఉండగా కంపెనీ నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించడంతో సీజ్ చేశామన్నారు. తదుపరి ఉత్తర్వులు అందేంత వరకూ అమ్మకాలు కొనసాగించరాదన్నారు.