కడప

నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(క్రైం)జూన్ 7: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిర్దేశిత ప్రాంతాలను కేటాయించడమైందని ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ తెలిపారు. పులివెందుల ప్రాంతం నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు బిల్టప్ సమీపంలోని ఈద్గా మైదానం, పుత్తా ఎస్టేట్, మరియాపురం చర్చి ప్రాంతాల్లో నిలపాలన్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు దేవునికడపలోని కదిరి ప్రసాద్ కల్యాణ మండపం, ఏపి వేర్ హౌసింగ్ గోడౌన్, మార్కెట్‌లో నిలపాలన్నారు. రాయచోటి, రాజంపేటల నుంచి వచ్చే బస్సులు పోలీసుపేరేడ్ మైదానం, సిఎస్‌ఐ చర్చి ప్రాంతాల్లో వుంచాలన్నారు. ద్విచక్రవాహనాలు, లైట్ వెహికల్స్, మున్సిపల్ హైస్కూల్ , ఉర్దూ హైస్కూల్ మెయిన్‌లో నిలపాలన్నారు. స్కౌట్ హాల్, అప్సర వద్ద వున్న సబ్‌స్టేషన్ ప్రాంతాల్లో ఉంచుకోవాలని ఎస్పీ తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.