కడప

జిల్లా టిడిపిలో తమ్ముళ్ల ఆధిపత్యపోరు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 7: జిల్లాలో తెలుగుతమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకు కోల్డ్‌వార్ తరహాలో వేడెక్కింది. జిల్లాలో రెండుమూడు నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గాల వారీగా ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరి అసలైన సిసలైన తెలుగుతమ్ముళ్లు తమ ఆక్రోశాన్ని, తమ ఆవేదనను వెళ్లబుచ్చుకుంటున్నా అధినాయకత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. అధిష్ఠానం పట్టించుకోకపోయినా తాము పార్టీ నుంచి మారే ప్రసక్తేలేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేకూర్చకపోయినా తమను నమ్ముకున్న అనుకూల నాయకులను, కార్యకర్తలను సముచితస్థానం కల్పించాలని వాపోతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆది నుంచి మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, ఇటీవల తెలుగుదేశంపార్టీలో చేరిన దేవగుడి సి.ఆదినారాయణరెడ్డి కుటుంబం మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుందని తాము పార్టీ సిద్దాంతాల కోసం తెలుగుదేశం పార్టీకోసం ప్రాణాలు విడిచేందుకు సిద్ధమేనని, తమ ప్రత్యర్థుల మధ్య సామరస్యాన్ని ప్రసాదించాలని జమ్మలమడుగు ఇన్‌చార్జి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మలు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానాన్ని వేడుకుంటున్నారు. అలాగే రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగి తెలుగుదేశంపార్టీని అంటిపెట్టుకుని తాను చివరిబొట్టు ఉన్నంతవరకు తెలుగుదేశంపార్టీలోనే కొనసాగుతానని, తనను నమ్ముకున్న అనుచరగణానికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని తన కుమారులు జెడ్పి చైర్మన్‌గా బాలసుబ్రమణ్యం, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్‌గా తన చిన్నకుమారుడు ప్రసాద్‌బాబు పార్టీనినమ్ముకుని ఉన్నారని, స్వపక్షంలోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది ఏమాత్రం నిజంకాదని మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే ఎస్.పాలకొండ్రాయుడు తన ఆవేదన వ్యక్తం చేశారు. పిఆర్‌పి స్థాపించిన చిరంజీవి తనతో పలు మార్లు సంప్రదించినా తాను పార్టీని మారే ప్రసక్తేలేదని పాలకొండ్రాయుడు తేల్చి చెప్పారు. పార్టీ హైకమాండ్ క్షేత్రస్థాయిలోకి వచ్చి విచారిస్తే నిజానిజాలు వెళ్లడైతాయని తన కుటుంబం ప్రచారాలకు, హంగులకు, ఆర్భాటాలకు దూరమని ఆయన పేర్కొంటున్నారు. తమకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని నమ్ముకున్న తన అనుచరగణానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన సేవలు పార్టీ గుర్తించి తనకు సముచిత స్థానం కల్పించకపోయినా 2019కి తాను జీవించి వుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగి తన సత్తానిరూపించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇక రాజంపేటలో మాజీ మంత్రి బ్రహ్మయ్య అనుచరగణాన్ని నియోజకవర్గంలో పొరకపూచలా చూస్తున్నారని అది ఏమాత్రం సబబుకాదని, తాను తెలుగుదేశం అభిమాని అని మాజీ మంత్రి పి.బ్రహ్మయ్య తన ఆవేదన వెలిబుచ్చారు. ఇక బద్వేలులో పార్టీలో మూడుముక్కల సంస్కృతి ఉందని, ఆ సంస్కృతికి ఫుల్‌స్ట్ఫా పెట్టాలని, బ్యాంకుమేనేజర్‌గా పనిచేస్తూ గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసిన ఎన్‌డి విజయజ్యోతి తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కడప నియోజకవర్గంలో మూడుముక్కలాటలో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయని అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో టిడిపి అధినేత చంద్రబాబు బుధవారం కడపకు వస్తున్న సందర్భంగా ఈ నియోజకవర్గాల నేతల మనోగతాలు అర్థం చేసుకుని పార్టీని బలోపేతం చేసి నాయకులందర్నీ ఏకతాటిపై నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.