చిత్తూరు

నవ్యాంధ్ర నిర్మాణానికి అందరి సహకారం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జూలై 7 : నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి అనేక కంపెనీలు వస్తుండటంతో నిరుద్యోగ యువతీ యువకులకు జాబులొస్తున్నాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సృష్టం చేశారు. పులిచెర్ల మండల కేంద్రంలో మంగళవారం నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి మంత్రి బొజ్జల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లిందని, నవ్యాంధ్ర నిర్మాణానికి అందరి సహకారం అవసరమని పిలుపునిచ్చారు. విభజన కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోవడంతో ఏపి లోటు బడ్జెట్‌లో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి, పట్టుదలతో అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, దీనిపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించడంతో నవ్యాంధ్ర ప్రజానీకం తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవడానికి పట్టిసీమ ప్రాజెక్ట్‌ను చేపట్టారని, దీంతో హంద్రీ-నీవా, గాలేరు-నగరి తదితర కాలువల మార్గంలో నీటిని తరలించేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు. నవ నిర్మాణ దీక్షలో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలని, చంద్రబాబునాయుడుకి అండగా నిలవాలని తెలిపారు.
* టిడిపి యువ నేత కుటుంబానికి మంత్రి పరామర్శ
పులిచెర్ల మండలానికి చెందిన టిడిపి యువ నాయకుడు వీరరాఘవులునాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మంగళవారం వికే పల్లికి విచ్చేసిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆయన కుటుంభాన్ని పరామర్శించాడు. ఈ సందర్భంగా మంత్రి బొజ్జల మాట్లాడుతూ యువ నాయకుడు వీరరాఘవులు మృతి బాధాకరమని, ఆయన పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీపరంగా ఆయన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు, జిల్లా టిడిపి నాయకులు చల్లా రామచంద్రారెడ్డి, రామనాథంనాయుడు, డిఎల్‌పిఓ సురేష్‌నాయుడు, ఎంపిడిఓ సౌభాగ్యం, తహశీల్దార్ రహంతుల్లా, ఎంపిపి మురళీధర్, జడ్పీటిసి అశోక్, పాకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ధనంజయనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటరమణ, టిడిపి నాయకులు ఆనందనాయుడు, సుబ్బారెడ్డి, గోవిందయ్య, సుబ్రహ్మణ్యంనాయుడు, నజీర్‌బాషా, రమేష్‌నాయుడు, నాగరాజనాయుడు, మోహన్‌నాయుడు, వెంకటేష్, పాతపేట సుబ్రహ్మణ్యం, పూల రమేష్, చెంగల్రాయనాయుడు పాల్గొన్నారు.