చిత్తూరు

తిరుపతిలో ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌కు సర్వర్ల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 7 : ఏపి ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ పక్రియ జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఒక కేంద్రంలోను, తిరుపతిలో రెండు కేంద్రాల్లో కౌనె్సలింగ్ కొనసాగుతోంది. తొలి రోజున నిర్దేశించిన ఎన్‌ఐసి సర్వర్‌లో సాంకేతిక లోపంతో ఈ పక్రియలో జాప్యం అనివార్యమైంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. అయితే రెండవరోజు మాత్రం కౌనె్సలింగ్ యధావిధిగా ప్రారంభమైంది. తిరుపతిలో మాత్రం రెండో రోజూ సర్వరుల డౌన్ అందినటుల సమాచారం అందింది. తొలిరోజు ఎంసెట్ లో 1వ ర్యాంకు నుంచి 5 వేల ర్యాంకు వరకు విద్యార్థుల సర్ట్ఫికెట్లను పరిశీలించాల్సి ఉండగా సర్వర్‌లో నెలకొన్న సాంకేతిక లోపంతో జాప్యం కావడంతో మరుసటి రోజు కూడా తొలిరోజు రాని వారికి అవకాశం కల్పించారు. మంగళవారం 5001 నుంచి 20,000 ర్యాంకు వరకు కౌనె్సలింగ్ జరిగింది. చిత్తూరులో మంగళవారం కౌనె్సలింగ్‌లో 141 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
తిరుపతిలో...
తిరుపతి: ఎంసెంట్ కౌనె్సలింగ్‌కు సర్వర్లు డౌన్ కావడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. తిరుపతిలో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల్లో ఏర్పాటు చేసిన ఎంసెట్ కౌనె్సంగ్ సెంటర్‌లో సోమవారం సాయంత్రం సర్వర్లు డౌన్ అవడంతో విద్యార్థులు రాత్రి వరకు వేచి చూశారు. అయితే మంగళవారం ఈ సమస్య ఉండదనుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వర్‌లు పనిచేయలేదు. దీంతో ఇంజినీరింగ్ సీట్ల కోసం వచ్చిన విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈనెల 15వ తేదీ వరకు సర్ట్ఫికేట్ల పరిశీలన జరగాల్సివుండగా ఈ తరహాలు సర్వర్లు పనిచేయకపోతే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.