తూర్పుగోదావరి

హైటెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 7: ఆకస్మిక ఉద్యమ నిర్ణయాలకు పెట్టింది పేరైన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి టెన్షన్ పుట్టించారు. గత రెండు రోజులుగా జిల్లాలో చర్చనీయాంశమైన తుని ఘటన అరెస్టుల నేపథ్యంలో మంగళవారం ముద్రగడ తనమార్కు ఉద్యమంతో ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసులకు చెమటలు పట్టించారు. ఒక విధంగా ముద్రగడ, పోలీసులు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకుసాగారు. ఉదయం 8.30 గంటలకు అమలాపురంలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాజమహేంద్రవరం మీదుగా కిర్లంపూడి చేరుకుని, రాత్రి 8 గంటలకు ముగిసింది. మొత్తంమీద సుమారు 12 గంటలు ముద్రగడ ఉద్యమం రాష్టవ్య్రాప్త కలకలం రేపింది.
తుని ఘటన నేపధ్యంలో సిఐడి అధికారులు అరెస్టుల పర్వాన్ని మొదలుపెట్టారు. అమలాపురంలో ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, లేదంటే తననూ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం మంగళవారం అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు తన అనుయాయులతో కలిసి బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఆయన అనుయాయులంతా పెద్దయెత్తున అమలాపురం స్టేషన్‌కు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఈ కేసులకు, తమకు ఎటువంటి సంబంధం లేదని, సిఐడి పరిధిలో కేసులు కాబట్టి తమకు తెలీదని, అమలాపురం పోలీసులు ముద్రగడకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో ముద్రగడ మరో పదిమందిని అదుపులోకి తీసుకుని అక్కడి నుండి పోలీస్ వాహనంలో తరలించారు. సరిగ్గా అక్కడి నుంచి హైడ్రామా మొదలైంది. పోలీసులు ముద్రగడను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలీదు. వాహనాలు ఎటు కదులుతున్నాయో తెలీదు. దీంతో అంతా టెన్షన్ నెలకొంది. రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తీసుకొస్తున్నారని తెలియడంతో అక్కడికి పెద్దయెత్తున కాపు సామాజిక వర్గ నాయకులు చేరుకున్నారు. కిర్లంపూడి, ప్రత్తిపాడు నుండి పెద్దయెత్తున అక్కడికి తరలివచ్చారు. కొద్దిసేపు కాకినాడ తరలిస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. రాజమండ్రిలోని సిఐడి కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు వంద మంది మఫ్తీ పోలీసులు వాహనాలను సమీపంలోని వీధుల్లో పార్క్‌చేసి మాటువేశారు. నాటకీయ పరిణామాల మధ్య ముద్రగడ వాహనాన్ని పోలీసులు రావులపాలెం నుండి జాతీయ రహదారిపై రాజమండ్రి మీదుగా ప్రత్తిపాడు వైపు పోనిచ్చి, అక్కడి నుంచి కిర్లంపూడి మళ్లించారు. దీంతో రాజమండ్రి సిఐడి కార్యాలయం ముందు ఉద్రిక్తత సడలింది. ముద్రగడ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వారిని మర్యాదపూర్వకంగా కలుస్తున్న తరుణంలో అమలాపురం నియోజకవర్గంలో అరెస్టుల పర్వం ప్రారంభం కావడంతో అక్కడి నుంచే ముద్రగడ రెండో ఉద్యమం మొదలైనట్టయింది.
అమలాపురం నుండి ముద్రగడను తరలించేస్తే సరిపోతుందని అంచనా వేసిన పోలీసులకు కిర్లంపూడి తీసుకెళ్లే సరికి కొత్త ఇరకాటం ఎదురైంది. ముద్రగడ ఇంటి గేటు పగులగొట్టి వాహనాన్ని లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. దీంతో కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముద్రగడ మరో లేఖను ముఖ్యమంత్రికి పంపించేందుకు సిద్ధం చేసుకుని జేబులో ఉంచుకున్నారని సమాచారం.
అయితే పోలీసులు ఆచితూచి అడుగేస్తున్నారు. అవసరమైన పక్షంలో మూకుమ్మడిగానైనా అరెస్టు చేయాలని వ్యూహంతో ముందుకెళ్లి, ఉద్రిక్తత తలెత్తేసరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు తెలిసింది. ముద్రగడను ఇంటికే పరిమితం చేయడం శ్రేయస్కరమని భావించి, ఈ ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అయితే ముద్రగడ ఎత్తుకు పైయెత్తు అన్నట్టుగా ఇంటి నుంచే భీష్మించడంతో పోలీసులు ఏమి చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. చివరకు రాత్రి 8 గంటల ప్రాంతంలో ముద్రగడ ఆందోళన విరమించి, వాహనం దిగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అయతే వాహనం దిగిన వెంటనే విలేఖర్లతో మాట్లాడుతూ ఉద్యమానికి సీక్వెల్‌గా గురువారం నుండి ఆమరణ దీక్ష ప్రకటన చేయడంతో పోలీసుల గుండెల్లో మళ్లీ గుబులు మొదలయ్యంది.