తూర్పుగోదావరి

విద్యుత్ నియామకాలపై వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూన్ 7: విలీన మండలాలైన చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లోని ఏడు విద్యుత్ ఫీడర్లలో పనిచేసేందుకు 28 మందిని కాంట్రాక్టు కార్మికుల నియామకం వివాదాస్పదంగా మారింది. స్థానిక ఆదివాసీ యువకులను కాదని కాంట్రాక్టరు బయటివారిని నియమించారని మంగళవారం ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు కార్మికుల నియామక బాధ్యతను విద్యుత్ ఉన్నతాధికారులు దీంతో సదరు కాంట్రాక్టర్ గత నెలరోజుల క్రితం రాజమహేంద్రవరంలోని తన నివాసం వద్ద దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 28 మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టు లెటర్లు ఇచ్చారు. కాంట్రాక్టర్ ఎంపిక చేసిన వ్యక్తులకు చింతూరు ఎడిఇ మధుసూదనరావు, ఎఇలు చింతూరు విద్యుత్ కార్యాలయం వద్ద ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీంతో గత కొనే్నళ్ల నుండి ఉద్యోగం చేస్తున్న గిరిజనులు, గిరిజనేతరులను ఉద్యోగంలోకి తీసుకోకుండా ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతారని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. అలాగే సదరు కాంట్రాక్టర్ ఉద్యోగం ఇస్తామని సొముమలు వసూలు చేశారని ఆరోపించారు. ఇదిలావుండగా ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు ఉద్యోగాలను స్థానిక గిరిజనులకు ఇవ్వాలని విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఉన్నతాధికారులు ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం గిరిజనులచే ఉద్యోగాల భర్తీ చేయాలని కాంట్రాక్టర్‌పై వత్తిడి తీసుకువచ్చారు. ఈ గందరగోళంతో విద్యుత్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటివరకు ఓపిగ్గా ఉన్న పోలీసులు కాంట్రాక్టర్‌ను, కాంట్రాక్టు ఉద్యోగులను, విద్యుత్ ఉన్నతాధికారులు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సిఐ దుర్గారావు వారందరితో చర్చలు జరిపారు. ఇక్కడ జరిగిన పరిణామాలను కాంట్రాక్టర్, విద్యుత్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఒక నిర్ణయం తీసుకోవాలని సిఐ సూచించారు. అలాగే ఉద్యోగ నియామక ప్రక్రియను కొద్దికాలంపాటు నిలిపివేయాలని ఆయన సూచించారు.