తూర్పుగోదావరి

రెండో రోజుకు ఇంజనీరింగ్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 7: జిల్లాలో రెండవ రోజు ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. వెబ్ కౌనె్సలింగ్ కావడంతో తొలిరోజైన సోమవారం సర్వర్లు మొండికేయడంతో కౌనె్సలింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగిన విషయం తెలిసిందే! మంగళవారం కూడా ప్రారంభంలో సర్వర్ సమస్య ఎదురైనప్పటికీ ఎట్టకేలకు కౌనె్సలింగ్‌ను సజావుగా నిర్వహించగలిగారు. రెండోరోజు జెఎన్‌టియుకె సహాయ కేంద్రానికి సంబంధించి 15001 నుండి 20 వేల ర్యాంకుల లోపు విద్యార్థులు కౌనె్సలింగ్‌కు హాజరుకావల్సి ఉండగా మొత్తం 250 మంది విద్యార్థులు హాజరైనట్టు కౌన్సిలింగ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జివిఎస్‌ఆర్ దీక్షితులు చెప్పారు. బుధవారం వర్సిటీ సహాయ కేంద్రంలో 30 నుండి 35 వేల లోపు ర్యాంకులు పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌనె్సలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కౌనె్సలింగ్‌లో భాగంగా విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, ఆయా బ్రాంచిల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.