గుంటూరు

మహిళాభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శ్రీ్ధర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 7: మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. మంగళవారం స్థానికంగా వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన మహిళా కిరాణా వర్తక సంఘాన్ని ఎమ్మెల్యే శ్రీ్ధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎపిఎం ఎస్‌వి కృష్ణప్రియ అధ్యక్షత వహించారు. మండల పరిధిలోని 50 కిరాణా షాపులను ఒక సొసైటీగా చేసి మినీ సూపర్‌బజారును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శ్రీ్ధర్ మహిళలనుద్దేశించి మాట్లాడుతూ డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందన్నారు. అనంతరం స్థానికంగా కృష్ణా పుష్కరాల నిమిత్తం జరుగుతున్న పనులను ఎమ్మెల్యే శ్రీ్ధర్ పరిశీలించారు. అలాగే ధరణికోట ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఎండిఒ వై రాజగోపాల్, తహశీల్దార్ కె నాసరయ్య, వెలుగు సిసిలు ఖాన్, సుధ, టిడిపి నాయకులు షేక్ మాబు సుభాని, జానీ, కొలనాటి కోటయ్య, కె వసంతరావు, సర్పంచ్‌లు జి నిర్మలాదేవి, బేతపూడి యలమంద పాల్గొన్నారు.