గుంటూరు

ఆళ్లగడ్డ హెడ్‌కానిస్టేబుల్‌కు ఐదేళ్ల ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జూన్ 7: పోలీసు అన్న అహంకారంతో ప్రయాణికుడిపై దౌర్జన్యం చేయడంతో పాటు చేతిలో ఉన్న పిస్టల్‌తో కాల్చి చంపేందుకు దూకుడు ప్రదర్శించిన ఓ హెడ్‌కానిస్టేబుల్ భారీ మూల్యానే్న చెల్లించుకున్నాడు. అతనికి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హోదాలో గుంటూరు రైల్వేజోన్ కేసులు విచారించే న్యాయమూర్తి ఓ వెంకట నాగేశ్వరరావు మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... గుంటూరు జిల్లా బొల్లాపల్లికి చెందిన మోదుకూరి సింగారావు కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల గ్రామంలో వ్యవసాయం చేస్తూ 2013 ఏప్రిల్ 23వ తేదీన నరసరావుపేట వచ్చేందుకు రైలులో బయల్దేరారు. మధ్యలో మార్టూరుకు చెందిన వెంకటేశ్వరరావు అనే స్నేహితుడు కలవడంతో గుంతకల్లు-యశ్వంత్‌పూర్ ప్యాసింజర్‌లో వీరు ప్రయాణం కొనసాగించారు. పాండ్యా రైల్వేస్టేషన్‌లో వెంకటేశ్వరరావు వాష్ రూమ్‌కు వెళ్లడంతో సింగారావు బెర్త్‌పై కాసేపు నడుంవాల్చాడు. ఆ సమయంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్టేషన్ చెందిన హెడ్‌కానిస్టేబుల్ ఈడిగ రామచంద్రగౌడ్ బెర్త్ నుంచి లేవాలంటూ సింగారావుకు హుకుం జారీచేశాడు. అప్పటికే ఆ బెర్త్‌పై నలుగురు కూర్చుని ఉన్నామని చెప్పినప్పటికీ రామచంద్రగౌడ్ వాదనకు దిగాడు. తన చేతిలో ఉన్న పిస్టల్ అడుగుభాగంతో సింగారావు ముఖంపై, వీపుపై మోదాడు. అంతటితో కూడా కోపం చల్లారని రామచంద్రగౌడ్ పిస్టల్‌ను గురిపెట్టి కాల్చాడు. దీంతో సింగారావు ఛాతిపై భాగం గుండా బుల్లెట్ దూసుకెళ్లింది. అనంతరం ఈ హెడ్‌కానిస్టేబుల్ రామచంద్రగౌడ్ మానవతా దృక్పధాన్ని నటించాడు. సింగారావును తొలుత నంద్యాల ప్రభుత్వాసుపత్రికి, అక్కడ్నుండి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి అనంతరం హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై 24వ తేదీన నంద్యాల రైల్వేపోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి నాగేశ్వరరావు హెడ్‌కానిస్టేబుల్ రామచంద్రగౌడ్ దూడుకుతనానికి ఆశ్చర్యపోయారు. ఆయనకు ఐదేళ్ల జైలుశిక్ష, 1500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నక్కా శారదామణి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.