ఖమ్మం

రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం టౌన్, జూన్ 7: రవాణాశాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని లక్ష్యాలను రూపొందించుకుంటూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రవాణాశాఖ కమీషనర్ సందీప్‌కుమార్ సల్తానియా అన్నారు. మంగళవారం కొత్తగూడెంలోని ఆర్టీఎ కార్యాలయాన్ని జాయింట్ కమీషనర్, జిల్లా రవాణాశాఖాధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా కమీషనర్ ఆర్టీఎ కార్యాలయాన్ని నిక్షితంగా పరిశీలించారు. ఆర్టీఎ నియమనిబంధనలు అన్ని తెలుగులోనే రాయించాలని ఎంవిఐ ధన్‌రాజ్‌బజాజ్‌కు సూచించారు. కార్యాలయం అంతా సందర్శించి డ్రైవింగ్‌లైసెన్స్‌కార్డులు, మిషన్స్, ఫైల్స్‌ను పరిశీలించారు. అదేవిధంగా 2016మాసపు రెవెన్యూ వసూళ్ళ నివేదికను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిఉద్యోగి రవాణాశాఠ పనితీరులో ప్రతిభ కనబరుస్తూ శాఖ అభివృద్ధికై పాటుపడాలని సూచించారు. రవాణాశాఖపై పట్టుపెంచుకుంటూ అధిక ఆదాయానికి సులువైన మార్గాలను ఎంచుకోవాలని అన్నారు. ప్రతి నివేదికను కంప్యూటర్‌లో ఉంచాలని, అడిగిన వెంటనే వివరణ ఇచ్చేందుకు సిద్దంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఉన్నతాధికారులు కూడా కిందిస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ సంయుక్త కమీషనర్ పాండురంగానాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి ఎంఎ ముహిమున్, ఎంవిఐ ధన్‌రాజ్‌బజాజ్, సింగు, రవాణాసిబ్బంది పాల్గొన్నారు.