కర్నూల్

స్టేడియంలో శిక్షణకు అనుమతించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు అర్బన్, జూన్ 7:జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని క్రీడా శిక్షణకు ఇవ్వాలని కోరుతూ జిల్లా ఒలింపిక్ సంఘం కోరింది. ఈ మేరకు మంగళవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.విజయకుమార్, రామాంజినేయులు మాట్లాడుతూ నూతన భవనంలో ఇండోర్ క్రీడల సాధనకు అనుమతించాలని, తద్వారా క్రీడాకారులకు ప్రయోజనం వుంటుందని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో ఒలింపిక్ సంఘం జిల్లా ప్రతినిధులు సుధీర్, ఎం.విజయకుమార్, నాగరత్నమయ్య, అవినాష్, తదితరులు పాల్గొన్నారు.