కర్నూల్

ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 7 : ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పని చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ విజయమోహన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించిన ప్రణాళికలను ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆయా శాఖలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ఆయా శాఖలకు సంబంధించి జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో జరిగే పనుల లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వాటి కోసం నివేదికలు తయారు చేయాలన్నారు. భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయి, వర్షపా తం ఎంత ఉంది, వాటిని ఏ విధంగా నిల్వ చేసుకుని ఉపయోగించుకోవాలనే అంశాలపై ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విరివిగా మొక్కలు నాటి జిల్లాను పచ్చగా సస్యశ్యామలం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇంటింటికీ ఇంకుడుగుంత తవ్వుకునే విధంగా చర్యలు తీసుకుని వాటిపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయన్నారు. పంట ఉత్పత్తులను పెంచుకునే విధంగా రైతులకు మెలకువలు సూ చించడంతో పాటు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సిపిఓ ఆనంద్‌నాయక్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.