కర్నూల్

నగరాభివృద్ధికి భారీగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 7:రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిందని మున్సిపల్ పరిపాలన అధికారి కన్నబాబు తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నగరంలో దాదాపు రూ. 167 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారని, వాటిని నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్ సిటీ కింద వచ్చిన నిధులను తాగునీటి పైపులైన్లు, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, రోడ్ల అనుసంధానికి వినయోగించాలని సూచించారు. అలాగే ప్రధాన రహదారుల్లో గోడలపై వాల్ పెయింట్స్ వేసి సుందర నగరంగా తీర్చిదిద్దాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వాల్ పెయింట్స్‌పై పోస్టర్స్ అతికిస్తే బిపిఎస్ పోస్టర్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధానాన్ని విశాఖ ప్టటణంలో అమ లు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు ఆనంద్ థియేటర్ నుంచి వినాయక్ ఘాట్ వరకూ రూ. 12కోట్లతో రో డ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. తాగునీటి సమ స్య పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామన్నా రు. ముఖ్యంగా నగర పాలక సంస్థ ఆదాయాన్ని పెం చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తి చేయాలని, గతంలో వీటి నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకుందని, దానిని అరికట్టేందుకు జియో ట్యాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించా రు. నగరంలో అన్ని మతాలకు చెందిన శ్మశానవాటికలు, ఉద్యానవనాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంజినీర్ల కొరత ఉందని పనులు సకాలంలో పూర్తి కావటంలేదని పలుమార్లు ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని కన్సల్టెన్సీ సహకారంతో పనులు పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో మున్సిపల్ ఎడిఎంఏ వెంకట్రామిరెడ్డి, ఎపిఎండిపి డైరెక్టర్ పివివిఎస్.మూర్తి, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, ఇన్‌చార్జి ఎస్‌ఇ శివరామిరెడ్డి, ఎంఇ రాజశేఖర్, డిఇలు మనోహర్‌రెడ్డి, సత్యనారాయణరావు, రాధాకృష్ణ, ఏఇలు పాల్గొన్నారు.